స్టాక్ మార్కెట్లు అంటేనే ఎప్పుడు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది చెప్పటం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో లాభాలు అంటే మామూలు విషయం కాదు. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లను తక్కువ సమయంలోనే మిలియనీర్లను చేస్తుంటాయి. పెట్టిన పెట్టుబడికి పలు రెట్ల రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.
శీయ స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనువుతున్న విషయం తెలిసిందే. ఇవాళ మార్కెట్లు మంచి జోష్‌లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 61 వల 462 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 84 పాయింట్ల లాభంతో 18 వేల 174 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకోవాలంటే వాటిపై పూర్తి అవగాహన ఉండాలి. అంతే కాదు నిపుణుల సూచనలు పాటిస్తూ పెట్టుబడులు పెట్టాలి. అయితే, అన్ని స్టాక్స్ లాభాలు అందించవని గుర్తుంచుకోవాలి. కానీ, సరైన స్టాక్స్‌ను గుర్తించి, సరైన సమయంలో పెట్టుబడులు పెడితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందుకోవచ్చు. అలాంటి ఓ మల్టీబ్యాగర్ స్టాక్ ఏడాదిలోనే ఇన్వెస్టర్ల దశ తిప్పింది. ఏకంగా 169 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అదే మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (Mazagon Dock Shipbuilders Ltd). ఎస్అండ్‌పీ స్మాల్ క్యాప్ కంపెనీ గడిచిన ఏడాది కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీ షేరు ధర మే, 4, 2022 రోజున రూ.293.90 వద్ద ఉండగా.. అది మే 4, 2023 రోజు రూ.790కి చేరింది. ఈ ఏడాది కాలంలో 169 శాతం మేర పెరిగింది. అంటే ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టినట్లయితే ఆ షేర్ల విలువ ఇప్పుడు రూ.2.69 లక్షలుగా ఉంటుంది.
ఈ మాజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ షిప్ బిల్డింగ్స్, సబ్ మెరైన్, హెవీ ఇంజినీరింగ్ వంటి వ్యాపారాలు చేస్తుంది. షిప్ బిల్డింగ్ డివిజన్‌లో నావల్ షిప్స్‌ను తయారు చేయడం, రిపేర్ చేయడం వంటి సేవలందిస్తుంది. ప్రస్తుతం నాలుగు పీ-15బీ డిస్ట్రాయర్స్, పీ-17ఏ స్టీల్త్ ఫ్రిగేట్స్ వంటివి తయారు చేస్తుంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఈ స్టాక్ రూ.785 వద్ద ప్రారంభమైంది. రూ.796 గరిష్ఠ స్థాయి, రూ.775 కనిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం రూ.790 పైన ట్రేడవుతోంది. ఒక్క రోజే 0.95 శాతం పెరిగింది. ఈ క్రమంలో ఈ స్టాక్‌ను తమ వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.