DailyDose

సోమాజిగూడకు దేశంలో రెండో స్థానం…

సోమాజిగూడకు దేశంలో రెండో స్థానం…

హైదరాబాద్ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే సోమాజిగూడ వీధి అరుదైన రికార్డు సాధించింది. దేశంలో బెస్ట్ హై షాపింగ్ వీధుల్లో రెండో స్థానం దక్కించుకుంది. జుయెలరీ షోరూమ్‌లు, పలు కంపెనీ ఆఫీసులు, క్లాత్ షోరూమ్‌లు ఎక్కువగా ఉన్న సోమాజీగూడలో కొనుగోలుదారులుకు అనువైన అన్ని సదుపాయాలు ఉన్నాయని నైట్ ఫ్రాంక్ అనే రియల్ ఎస్టేట్ మార్కెట్ సంస్థ తెలిపింది. నైట్‌ఫ్రాంక్ ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్’ పేరుతో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ షాపింగ్ అడ్డాకు రెండో స్థానం దక్కింది. భారతీయ సిలికాన్ వ్యాలీ బెంగళూరులోని మహాత్మాగాంధీ రోడ్డు నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సర్వేలో భాగం దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో షాపింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. సోమాజిగూడ అన్ని రకాల షాపింగ్‌కు అనుకూలంగా ఉందని, పార్కింగ్‌ వసతులు చక్కగా ఉన్నాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ‘‘ఆధునిక, సాధారణ షాపింగ్ విస్తీర్ణంలోనూ హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కేపిటర్ రీజియన్(ఢిల్లీ) 52 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైస్ట్రీట్ షాపింగ్ సాగుతుండగా, హైదరాబాద్‌లో ఆ విస్తీర్ణం 18 లక్షల చదరపు మీటర్లు. 15 లక్షల చదరపు మీటర్లతో అహ్మదాబాద్, బెంగళూరు తర్వాతి స్థానాల్లో నిలిచాయి’’ అని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. బెస్ట్ హైస్ట్రీట్స్ టాప్ 10 జాబితాలో లింకింగ్ రోడ్డు(ముంబై), సౌత్ ఎక్స్‌టెన్షన్ (ఢిల్లీ), అన్నానగర్ (చెన్నై), పార్క్ స్ట్రీట్ (కోల్ కతా) ఉన్నాయి.