Movies

హీరో శ‌ర్వానంద్‌ కారు యాక్సిడెంట్….

హీరో శ‌ర్వానంద్‌ కారు యాక్సిడెంట్….

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు బిగ్ షాక్ తగిలింది. హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరుగుతుందని సమాచారం అందుతుంది.

అతి వేగం కారణంగా హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో హీరో శర్వానంద్ కారు బోల్తా కొట్టింది. అయితే… కారు బోల్తాపడడంతో… హీరో శర్వానంద్ కు కొన్ని గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.

ఇక అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు హీరో శర్వానంద్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం హీరో శర్వానంద్ కుటుంబ సభ్యులు కూడా…ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా…ఇప్పుడు హీరో శర్వానంద్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని సమాచారం అందుతోంది.