NRI-NRT

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ బంగా….

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన  అజయ్ బంగా….

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి అమెరికన్ అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి అతని పేరును గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. మే 3న జరిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశంలో అజయ్ బంగాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్, తొలి నల్ల జాతీయుడు ఈయనే.

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ బంగాకు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టాలినా జార్జివా అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికవ్వక ముందు ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సేవల సంస్థ మాస్టర్ కార్డ్ సీఈఓగా పని చేశారు.

1959 నవంబర్ 10న పుణెలో అజయ్ బంగా జన్మించారు. అజయ్ బంగా తండ్రి హర్బజన్ బంగా.. భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. అజయ్ బంగా విద్యాభ్యాసం జలంధర్, సిమ్లాలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో భారత ప్రభుత్వం అజయ్ బంగాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.