NRI-NRT

“టాక్ లండన్ బోనాల” జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత…

“టాక్ లండన్ బోనాల” జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత…

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జూన్ 25 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్దీసి చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న కవిత గారికి టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రత్యేక కృతఙతలు తెలిపారు. కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని మీడియాకి తెలిపారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్ ని సంప్రదించమని తెలిపారు.

TAUK LONDON BONALU poster launched by MLC Kavitha
TAUK – Telangana Association of United Kingdom London Bonalu poster was launched by BRS MLC Smt. Kalvakuntla Kavitha at Hyderabad. This event is celebrated on June 25th at Isleworth and Syon school Auditorium, Hounslow, London.

She appreciated the efforts of TAUK in promoting Telangana culture on global platform and extended her best wishes for the upcoming Bonalu event at London.

TSFDC Chairman & TAUK Founder Anil Kurmachalam and various State Corporation Chairman’s were also present in this launching event.

Telangana Association of United Kindgom (TAUK) President Rathnakar Kadudula spoke to media and said, On behalf of TAUK we thank
MLC smt. Kavitha for her continuous support & encouragement to TAUK since its inception. Its not just a poster launch with her but with her guidance we do our best to promote our culture globally. also appealed the community in UK to attend and encourage the efforts to promote Indian culture on foreign land.

He also thanked all the Corporation Chairman’s who participated in this event and encouraged TAUK efforts.
For more details visit www.tauk.org.uk and reach us.

Regards,
Rathnakar Kadudula
President – TAUK