NRI-NRT

పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మనదేశ మత్స్యకారులు….

పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మనదేశ మత్స్యకారులు….

సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు అప్పుడప్పుడు పొరపాటుగా అంతర్జాతీయ సముద్ర జల సరిహద్దులు దాటుతుంటారు. ఆ సమయంలో ఇతర దేశ అధికారులు మత్స్యకారులను బంధించి వారి నుంచి బోటులను స్వాధీనం చేసుకొని జైల్లో ఖైదు చేస్తుంటారు. ఇటాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మానవత దృష్టితో జాలర్లను విడుదల చేసి స్వదేశాలకు పంపుతుంటారు. ఈ క్రమంలో భారత దేశానికి చెందిన 200 మంది మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సముద్రంలో చేపల కోసం బోట్లు వేసుకొని వెళ్లే జాలర్లు అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు గమనించకుండా దాటిపోతుంటారు. అలా మత్స్యకారుల పడవలు అరెబియా సముద్రంలోని ప్రాదేశిక జలాల గుండి పాకిస్థాన్ లోకి చేరాయని ఆరోపిస్తు పలువురు జాలర్లను అదుపులోకి తీసుకుంది. జాలర్లు కొంతకాలం పాక్ జరసాలల్లో గడిపారు. మానవతా దృష్టితో 200 మంది భారతీయ జాలర్లు, మరో ముగ్గురు పౌర ఖైదీలను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిల్వాన్ భుట్టో జర్దారి శుక్రవారం ప్రకిటించారు. వారిని అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో వాఘా సరిహద్దు వద్ద భారతీయ అధికారులకు అప్పటించారు. ‘200 మంది భారతీయ జాలర్లతో పాటు మరో ముగ్గురు పౌర ఖైదీలను పాక్ విడుదల చేస్తుంది. ఇంతకు ముందు మే 12న 198 మంది భారతీయ జాలర్లను భారత దేశానికి అప్పగించడం జరిగింది’ అంటూ మంత్రి బిల్వాన్ భుట్లో జర్దారీ ట్విట్ లో పేర్కొన్నారు. మానవత్వం విలువలను గౌరవిస్తూ.. ఈ అంశాలను రాజకీయం చేయరాదన్న పాక్ విధానాన్ని అనుసరించి వీరిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు భారత ఖైదీలను విడుదల చేయడాన్ని కరాచీ నుంచి లాహూర్ వరకు ప్రయాణ ఖర్చుల కోసం నిధులు సమకూర్చిన ఈదీ ఫౌండేషన్ సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది.