Editorials

నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం….

నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం….

ఈ కార్తె రోజు ప్రతి ఇంట్లో బెల్లంలో ఇంగువ కలుపుకొని  తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది.

మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో బెల్లంలో ఇంగువ కలుపుకొని  తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. బెల్లంలో ఇంగువ కలుపుకొని  తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో బెల్లంలో ఇంగువ కలుపుకొని  తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండెజబ్బులు , ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకొని  తినాల్సిందే. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే రైతులు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు. మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రత్యేకించి ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు.  ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి. వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు.

అసలు మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏమిటి..?

వ్యాధుల నియంత్రణకు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు. మృగశిర కార్తె రోజు బెల్లంలో ఇంగువ కలుపుకొని  ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగులగొట్టే ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె బెల్లంలో ఇంగువ కలుపుకొని  తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు.. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుండి గట్టెక్కాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకొని తినాల్సిందే.

పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు.  ఈ రోజు ఏ ఇంటా చూసినా  బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు.

పంచాంగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.

పురాణగాధ ప్రకారం

మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.

ప్రకృతి మార్పు ప్రభావం
ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు.