Movies

పవర్ హీరోయిజం నుంచి జీరోయిజం పడిపోయాడని ఆర్జీవీ కామెంట్స్…..

పవర్ హీరోయిజం నుంచి జీరోయిజం పడిపోయాడని ఆర్జీవీ కామెంట్స్…..

ఓవైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కుతుంటే… మరోవైపు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తగ్గేదేలేదంటున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పిస్తున్న వర్మ… జగన్ జీవిత చరిత్రతో సినిమాను సైతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తిగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీస్తున్నాడు.

మరోవైపు కాసేపటి క్రితం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుక్కుంటున్నాడని ఆర్జీవీ ఎద్దేవా చేశాడు. ఆయన కులం వ్యక్తులు, అభిమానుల గుండెల్లో హీరోయిజం నుంచి జీరోయిజంకు పవర్ స్టార్ పడిపోయాడని అన్నాడు. వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ మేరకు సెటైరికల్ ట్వీట్ చేశారు.

జనసేన అధినేత పవన్‌ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (జూన్‌ 15) చేబ్రోలు సభలో ఆసక్తికర కామెంట్లు చేశారు పవన్‌.‘అసెంబ్లీకి పంపండి. ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి’ అంటూ ప్రజలను అభ్యర్థించారు పవన్‌. ఇప్పుడీ వ్యాఖ్యలపైనే కౌంటర్ వేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.