Food

న్యూ ట్రెండ్ నాన్ వెజ్ పానీపూరి….

న్యూ ట్రెండ్ నాన్ వెజ్ పానీపూరి….

పానీపూరీ వయసు తో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. రోడ్డు పక్కన ఉన్న పనీ పురీ బండి చూస్తే చాలు వెంటనే నోటిలో నీరు తిరుగుతూ.. తినాలి అనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆహార పదార్ధాలపై వింత వింత ప్రయోగాలు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు పానీపూరీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పులుపు-కారం, తీపి కలయికతో నోరికి రుచికరంగా ఉండే పానీపూరీని ఇష్టపడి మరీ తింటారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మెన్ సరికొత్తగా ఆలోచించి పానీపూరీని సరికొత్తగా ఆవిష్కరించాడు. ఇప్పటి వరకూ వెజ్ పానీపూరీని ఆస్వాదించిన గోల్గప్పా ప్రియులకు చికెన్ , మటన్‌తో అందిస్తున్నాడు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం నాన్ వెజ్ పానీపూరి ఏమిటంటూ ఊగిపోతున్నారు. రితుపర్ణ ఛటర్జీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. బెంగాల్‌లోని ఒక స్ట్రీట్ ఫుడ్ షాప్ ని పరిచయం చేస్తూ షాప్ మెనూ చిత్రాన్ని షేర్ చేసింది. ఇప్పుడు ఈ మెనూ చదివిన జనాలు షాక్ అవుతున్నారు.ఒక పానీపూరీ దుకాణం వద్ద ఉన్న మెనూ ప్రకారం, చికెన్-మటన్ లతో మాత్రమే కాదు రొయ్యలతో పానీపూరీ కూడా అందిస్తున్నారు. అంతేకాదు ఈ గోల్గప్పలో మరికొన్ని రకాలు ఉన్నాయి. అయితే నాన్ వెజ్ పానీపూరీ పెద్దగా ఆకర్షించినట్లు లేదు.