Business

88 వేల కోట్ల ఆచుకీ లేదన్న ఆర్బీఐ-TNI నేటి వాణిజ్య వార్తలు

88 వేల కోట్ల ఆచుకీ లేదన్న ఆర్బీఐ-TNI నేటి వాణిజ్య వార్తలు

* భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం (GOLD) ధరలు మరోసారి పెరిగాయి. నిన్నటి పోల్చితే 22 క్యారెట్ల తులం బంగారంపై 400 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 440 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (GOLD) ధర 55,100 రూపాయలుగా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (GOLD) ధర 60,110 రూపాయలుగా పలుకుతోంది.

* అదానీ చేతికి ట్రైన్‌మ్యాన్‌

ఆన్‌లైన్‌ ట్రైన్‌ బుకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ ట్రైన్‌మ్యాన్‌ను (Trainman) అదానీ గ్రూప్‌ (Adani group) కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌ ఈ స్టారప్‌ను దక్కించుకుంది. ఈ మేరకు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. నూరు శాతం వాటా కొనుగోలుకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు.

* ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు

మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలా? పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఏదైనా వివరాలను మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే మార్చేసుకోండి. లేదంటే.. ఆ తర్వాత మార్చుకోవాలంటే జేబులో డబ్బులు ఖర్చు చేయాల్సిందే.. ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తోంది. జూన్ 14 లోగా ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది. కానీ, ఇప్పుడు ఆ గడువు తేదీ ముగిసిపోయింది.అందుకే, ఆధార్ కార్డు వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తూ గడువు తేదీని కాస్తా వచ్చే సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోలేని సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా (UIDAI) చివరి తేదీని మరో మూడు నెలల వరకు పొడిగించినట్టు వెల్లడించింది

కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్న చైనా యువత!

చైనా యువత నయా ట్రెండ్ను అనుసరిస్తున్నారు. లక్షల జీతాలు వదులుకుని వెయిటర్స్, చెఫ్స్, క్లీనర్స్ మారుతున్నారని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. కొత్త ఉద్యోగంతో శరీరం అలిసిపోయి, మానసిక ప్రశాంతత ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాయి. my first physical work experience పేరుతో వారి అనుభవాలను పంచుకుంటున్నారని వెల్లడించాయి. యాంత్రికంగా పనిచేయడం ఇష్టం లేకనే యువత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

* 88 వేల కోట్ల ఆచుకీ లేదన్న ఆర్బీఐ

దాదాపు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదని తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది. పాతనోట్లను రద్దు చేసి, కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ, అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి చేరినట్లు ఆర్‌టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్‌బీఐ దగ్గర లేదు

* రూ.20 నోటు ఇచ్చి రూ.50 లక్షలు కొట్టేసిన కొరియర్‌ బాయ్స్‌

రూ.20 నోటు ఇచ్చి యాబై లక్షలు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కొరియర్‌ బాయ్స్‌. వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శైలేందర్ సింగ్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. అయితే అంగాడియ కొరియర్‌కు చెందిన వ్యక్తి ద్వారా తనకు 50 లక్షలు పంపించాలని అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తి శైలేందర్‌ను ఫోన్‌లో అడిగాడు. అందకు గాను శర్మ అనే వ్యక్తి నీ దగ్గరకు 96 ఎం 279764 నెంబర్ తో ఉన్న 20 రూపాయల నోటు తీసుకొస్తాడని అతడికి రూ.50 లక్షలు ఇవ్వమని అమన్‌ప్రీత్‌ తెలిపాడు.

* వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం (జూన్ 17) తెల్లవారుజామున ఈ సమస్య మొదలైంది. లక్షలాది మంది యూజర్లు, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లను యాక్సెస్ చేయలేకపోయారు. చాలా సేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవలేదు. రిసీవ్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్‌లు పంపడానికి ఇబ్బంది పడ్డారు. ఇన్ స్టాగ్రామ్లో స్టోరీలు లోడ్ అయినప్పటికీ..ఎర్రర్ మెసేజ్ లు వచ్చాయి. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్, ఫేస్ ముక్ మెసేంజర్లలో సందేశాలను పంపడంలో స్వీకరించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు. డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్‌ ప్రకారంఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. సేవల అంతరాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ అంగీకారించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వినియోగదారులకు హామీ ఇచ్చింది.

* ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డును నమోదు చేసిన ‘ఆదిపురుష్’

రామాయణం కథను దర్శకుడు ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ గా తెరపై ఆవిష్కరించాడు. ప్రభాస్ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందింది. శ్రీరాముడిగా ప్రభాస్ సీతాదేవిగా కృతి సనన్ హనుమంతుడిగా దేవ్ దత్త రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 140 కోట్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించింది. శని ఆదివారాల్లో ఈ సినిమా 300 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

* రైలు ప్రయాణంలో మీ లగేజీ పోతే రైల్వే బాధ్యత వహిస్తుందా?

భారతీయ రైల్వే దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ట్రైన్‌లో ప్రయాణించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ప్రకనను చాలా సార్లు విని ఉంటారు. అదేంటంటే.. ‘ప్రయాణికులారా దయచేసి గమనించండి.. ప్రయాణికులు తమ లగేజీని జాగ్రత్తగా ఉంచుకోవాలి’ అని. ఈ ప్రకటనపై కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైలు ప్రయాణంలో ప్రయాణికుల లగేజీ ఏదైనా పోయినట్లయితే దానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. రైల్వే లోపం వల్ల ఇలా జరిగిందని పరిగణించలేమని, అందుకు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది

బీసీలకు రూ.1,00,000 ప్రభుత్వం కీలక సూచన

TS: బీసీ కులాలకు ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సాయం దరఖాస్తు గడువు జూన్ 20తో ముగియనుంది. ఇప్పటివరకు 2 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలని, ఆ ఫారాన్ని అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రజక, నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, వడ్డెర కులాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు.