Sports

ఇంగ్లండ్ స‌గం వికెట్లు డౌన్

ఇంగ్లండ్  స‌గం వికెట్లు  డౌన్

యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ క‌ష్టాల్లో ప‌డింది. నాథ‌న్ లియాన్ మ్యాజిక్ చేయ‌డంతో ఐదు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి బెన్ స్టోక్స్‌(13), జానీ బెయిర్‌స్టో(1) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్ద‌రూ నిల‌బ‌డితే స‌రి. లేదంటే ఇంగ్లండ్ తొంద‌ర‌గానే ఆలౌట్ అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం 182 ప‌రుగుల‌ ఆధిక్యంలో ఉంది. హాఫ్ సెంచ‌రీ చేరువైన జో రూట్(46), హ్యారీ బ్రూక్‌(46) లియాన్ బౌలింగ్‌లో ఔట‌య్యారు. జోరు మీదున్న‌ రూట్‌ను అలెక్స్ క్యారీ స్టంపౌట్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ స్కోర్ నెమ్మ‌దించింది.మూడో రోజు ఆట‌కు వ‌ర్షం అతరాయం క‌లిగింది. దాంతో, ఓవ‌ర్ నైట్ స్కోర్ 28తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెష‌న్‌లోనే షాక్ త‌గిలింది. ఓలీపోప్(14)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ కొట్టిన రూట్, బ్రూక్ ఇన్నింగ్స్ నిల‌బెట్టారు. రూట్ స్వీప్ షాట్ల‌తో అల‌రించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 386 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దాంతో, ఇంగ్లండ్‌కు 7 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.