NRI-NRT

పెదనందిపాడులో నాట్స్ ఉచిత నేత్ర వైద్య శిబిరం

పెదనందిపాడులో నాట్స్ ఉచిత నేత్ర వైద్య శిబిరం

పెదనందిపాడులో నాట్స్ ఉచిత నేత్ర వైద్య శిబిరం 1000 మందికి పైగా ఉచిత నేత్ర పరీక్షలు అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి చుట్టు పక్క గ్రామాల నుంచి పేద రోగులు 1000 మందికిపైగా రోగులు తరలివచ్చారు. నాట్స్, గ్లో ఫౌండేషన్, శంకర నేత్రాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉచిత నేత్ర వైద్యశిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించారు. 600 మందికి కంటి ఆపరేషన్లు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. ఇందులో పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదాన్ని చేతల్లో చూపిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
జన్మభూమి రుణం తీర్చుకుంటున్న నాట్స్ అధ్యక్షుడు నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని రిటైర్డ్ ఐజీ ఎ.రవిచంద్ర అన్నారు. అటు అమెరికాలోనే కాకుండా ఇటు తెలుగునాట కూడా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా మంది పేదలకు సాయం చేస్తున్నాయని ప్రశంసించారు. తన పుట్టిన ఊరు కోసం పేదల కోసం ఆలోచించి అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న బాపయ్య చౌదరిని పీఈడీ సోసైటీ ప్రెసిడెంట్ శ్రీకాళహస్తి సత్యనారాయణ ప్రశంసించారు. పెదనందిపాడు గ్రామంలో నాట్స్ చేస్తున్న సేవలను నర్రా బాలకృష్ణ కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో శీలం అంకారావు, మక్కెన జవహర్ రాణి, శ్రీ ముద్దన రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.