Movies

నటిని అవమానించిన సల్మాన్

నటిని అవమానించిన సల్మాన్

సినీ తారలు వారి వ్యక్తిగత రక్షణ కోసం బాడీ గార్డ్‌లను నియమించుకుంటారు. అయితే ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల ఆ సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) బాడీ గార్డ్స్‌ బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ను తోసేసిన న్యూస్‌ నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. దీనిపై విక్కీ వివరణ కూడా ఇచ్చాడు. తాజాగా మరో నటి సల్మాన్‌ భద్రత సిబ్బంది గురించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

‘దబాంగ్‌3’ (Dabangg 3)లో కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ శర్మ (Hema Sharma). ఆ సినిమా నిర్మాణ సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని తాజాగా ఈ నటి గుర్తుచేసుకుంది. ‘‘దబాంగ్‌3’లో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను. సినిమా షూటింగ్ అయిపోయాక సల్మాన్‌తో ఫొటో కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ ఆయన బాడీ గార్డ్స్‌ నన్ను దారుణంగా అవమానించారు. కుక్కని తరిమినట్లు తరిమేశారు. ఆ సమయంలో సెట్‌లో కనీసం 100 మంది ఉన్నారు. వాళ్లందరి ముందు నాతో అలా ప్రవర్తించే సరికి నాకు 10 రోజులు నిద్రపట్టలేదు. ఆయనతో ఫొటో కోసం నేను ఎంతోమందిని అడిగాను. బిగ్‌బాస్‌కు వచ్చినప్పుడు నా కోరిక చెప్పాను’’ అని హేమశర్మ తెలిపింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌తో సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరలైంది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.