WorldWonders

అవును… కరోనా చైనా చేసిన జీవాయుధం:చైనా పరిశోధకుడు

అవును… కరోనా చైనా చేసిన జీవాయుధం:చైనా పరిశోధకుడు

చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.

ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు.చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే  తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు.