DailyDose

అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం-TNI నేటి తాజా వార్తలు

అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం-TNI నేటి తాజా వార్తలు

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 62 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేంకటేశ్వరుని హుండీకి నిన్న రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

* అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

జులై 1 నుంచి అమ‌ర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభం కానున్న‌ది. ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు ఈ యాత్ర కొన‌సాగుతుంది. ఈ యాత్ర కోసం కేంద్రం (Central Govt), జ‌మ్ముకాశ్మీర్ ప్ర‌భుత్వం (Jammu Kashmir Govt) భారీ ఏర్పాట్ల‌ను చేస్తున్న‌ది. ఈ యాత్ర‌ను చేసేందుకు ఇప్ప‌టికే 1500 మంది జ‌మ్ముకు (Jammu) చేరుకున్నారు. కాగా, ఈ యాత్ర‌కోసం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రిజిస్ట్రేష‌న్ చేసుకోనివారి కోసం స్పాట్ రిజిస్ట్రేష‌న్ల (Sport Registrations) కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. జ‌మ్ములోని షాలిమ‌ర్ (Shalimar) ప్రాంతంలో ఓ రిజిస్ట్రేష‌న్ సెంట‌ర్‌ను, అదేవిధంగా సాధువుల కోసం రామాల‌యం (Ramalayam) ప్రాంతంలో మ‌రో సెంట‌ర్‌ను ఏర్పాటు చేసింది. ఈ రెండు సెంట‌ర్ల నుంచి స్పాట్ రిజిస్ట్రేష‌న్లు చేప‌డుతున్నారు. ఎవ‌రైనా రిజిస్ట్రేష‌న్లు లేకుండా వ‌చ్చిన‌వారు అక్క‌డ రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు.

TS పాలిసెట్ తుది కౌన్సెలింగ్

తెలంగాణ పాలిసెట్ ఫైనల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 1 నుంచి విద్యార్థులు ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని.. జులై 2న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. జులై 1 నుంచి 3వ తేదీ వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. జులై 7న సీట్లు అలాట్మెంట్ చేస్తామని సాంకేతిక విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్

 అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు తొలి బ్యాచ్ భ‌క్తులు ఇవాళ తెల్ల‌వారుజామున బ‌య‌లుదేరి వెళ్లారు. జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా .. భ‌గ‌వ‌తి న‌గ‌ర్ బేస్ క్యాంపు వ‌ద్ద జెండా ఊపి యాత్ర‌కుల బ‌స్సును ప్రారంభించారు. తొలి మ్యాచ్ మొద‌ట‌గా ప‌హ‌ల్గామ్‌, బ‌ల్తాల్ బేస్ క్యాంపు వ‌ద్ద‌కు వెళ్తారు. అక్క‌డ నుంచి హిమాల‌యాల్లో ఉన్న అమ‌ర్‌నాథ్ క్షేత్రానికి వెళ్తారు. రెండు ట్రాక్ల ద్వారా జూలై ఒక‌టో తేదీ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. సుమారు 62 రోజుల పాటు ఈ యాత్ర కొన‌సాగుతుంది. నున్‌వాన్‌-ప‌హ‌ల్గామ్ రూటు అనంత‌నాగ్ జిల్లాలో ఉంటుంది. ఇది సుమారు 48 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక బ‌ల్తాల్ రూటు చాలా పొట్టింది. ఇది 14 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇవాళ ఉద‌యం సుమారు 3500 మంది భ‌క్తులు యాత్ర ప్రారంభించారు.

53 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి

ప్రముఖ హాలీవుడ్ నటి,  మోడల్  నవోమి కాంప్‌బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే  మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో  రెండో బిడ్డను స్వాగతించారు.  తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.

తమ్మారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం?

TS: కాంగ్రెస్లో చేరాల్సిందిగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అధిష్టానం ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు ఫోన్ చేయగా, తన నిర్ణయాన్ని వారంలో చెబుతానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆయన కోసం మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్ట్ భావాలున్న ఈయనకు అన్ని పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్నాయి.

రాహుల్ మణిపూర్ పర్యటనపై మండిపడ్డ అసోం సీఎం

మణిపూర్ లో నెలకొన్న విభ‌జ‌న పరిస్థితులకు రాజకీయ నాయకుడి కంటే కరుణ అవసరమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. జాతి కలహాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు పర్యటనను ప్రస్తావిస్తూ, ఇది కేవలం మీడియా హైప్ మాత్రమేనని శర్మ పేర్కొన్నారు. మణిపూర్ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయనీ, రాహుల్ గాంధీ వంటి నాయ‌కుల‌ రోజువారీ పర్యటనల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు ఉండవని శర్మ అన్నారు. “రాహుల్ గాంధీ ఒక్క రోజు మాత్రమే మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అది మీడియా హైప్ తప్ప మరేమీ కాదు. ఈ పర్యటన నుంచి సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ అలాంటి పర్యటన వల్ల ఎలాంటి ఫలితం ఉండదు” అని శర్మ అన్నారు.

త్వరలో BJP, BRS నుంచి కాంగ్రెస్లోకి చేరికలు: పొంగులేటి

 ఖమ్మంలో జులై 2న కాంగ్రెస్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా సభకు వచ్చే జనాన్ని ఆపలేరని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన చేరికతో జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి ఉందని పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలో BJP, BRSల నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉంటాయన్నారు.

* ఖమ్మంలో గ్రూపు రాజకీయాలు వద్దు : రేవంత్ రెడ్డి

ఖమ్మంలో జులై 2న జరిగే తెలంగాణ గర్జన (Telangana garjana) సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభతో వచ్చే ఎన్నికల్లో గెలుపునకు నాంది పలకాలన్నారు. సభ ఏర్పాట్లపై సమీక్షలో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District)లో పార్టీ బలపడుతుంది. ఇక్కడ పదికి పది స్థానాలు గెలవాలి. గ్రూపు రాజకీయాలు లేకుండా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని రేవంత్‌ సూచించారు. ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన ప్రజల కంటే ఎక్కువమందినే తీసుకుని వస్తారని, తమ సభ కంటే ఎక్కువ మంది కదం తొక్కుతారని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), రేణుకా చౌదరి రెండు కళ్ళు .. తమ మూడో కన్ను శ్రీనివాస రెడ్డి అని రేవంత్ చెప్పారు.

సీఎం జగన్ కు పవన్ వార్నింగ్

అమ్మఒడి సభలో తన వైవాహిక జీవితంపై సీఎం జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో బదులిచ్చారు.మిస్టర్ జగన్… చెవులు విప్పుకుని విను… నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు… నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిక్షణం నాకు తెలుసు… మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు… చెబుతాను! నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త! అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “జగన్… నీకే చెబుతున్నా. నువ్వు ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ఇది గట్టి వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాం… సిద్ధంగా ఉండు” అని పవన్ స్పష్టం చేశారు. 

* తొలిప్రేమ రీరిలీజ్.. ఫ్యాన్స్ సందడి

టాలీవుడ్‌లో గతకొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్‌ను పవర్‌స్టార్ కూడా ఫాలో అవుతున్నారు. కాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమాను ఇవాళ థియేటర్లలో మళ్లీ 4kలో రీరిలీజ్ చేశారు.దీంతో థియేటర్ల వద్ద పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఈ మేరకు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా పవన్ కెరీర్‌లో ఇదొక క్లాసిక్ సినిమా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.