Business

ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్

ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్

ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ యూజర్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా మరో షాకింగ్ విషయం చెప్పారు. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు మస్క్ చెప్పారు. అయితే, ఆ పరిమితులు ఒక్క అన్‌వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకే కాదు.. వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకు కూడా. వెరిఫై‌ అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు చదవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అన్‌వెరిఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులకు, ఇక కొత్త అకౌంట్లు తెరిచిన అన్‌వెరిఫైడ్ యూజర్లు రోజుకు 300 ట్వీట్లు మాత్రమే చదవడానికి అవకాశం కల్పిస్తూ ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. విపరీతమైన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ ను పరిష్కరించడానికి తాము ఈ పరిమితులను విధించినట్లు మస్క్ వివరించారు.

మస్క్ మరికొద్ది గంటల్లోనే మరో ట్వీట్ చేశాడు. ట్విటర్ యూజర్లు చదవ గలిగే పోస్టులపై పరిమితులు విధించిన మస్క్.. వాటిలో త్వరలో కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. వెరిఫై అకౌంట్ ఉన్నవారు 8వేలు, అన్ వెరిఫై అకౌంట్ కలిగిన యూజర్లు 800 పోస్టులు, కొత్త అన్‌వెరిఫైడ్ యూజర్లు 400 పోస్టులు చదివేలా త్వరలో పెంచుతామని మస్క్ ఆ ట్వీట్‌లో తెలిపారు. వందలాది సంస్థలు ట్విటర్ డేటాను అత్యంత దూకుడుగా స్క్రాప్ చేస్తున్నాయని, ఇది వినియోగదారును ప్రభావితం చేస్తుందని మస్క్ చెప్పారు.