Health

బ్లాక్ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు

బ్లాక్  కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు

మనలో చాలా మంది బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. ఈ కాఫీ తాగితే పని ఒత్తిడి తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉదయాన్నే పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి కాస్త చేదుగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడును చురుగ్గా ఉంచే బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవడంలో సమర్థంగా పనిచేస్తుంది. విటమిన్ బి-2, బి-3, మెగ్నీషియం, పొటాషియం, వివిధ ఫినాలిక్ రసాయనాలు సహజంగా కాఫీలో పుష్కలంగా ఉంటాయి. పైగా బ్లాక్ కాఫీలో పాలు లేదా చక్కెర ఉండవు. కాబట్టి ఈ కాఫీ తాగడం వల్ల కొవ్వులు, కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్లు శరీరానికి అందవు. మరి బ్లాక్‌ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.

  • బ్లాక్ కాఫీ క్యాలరీలు లేని పానీయం. ఇది అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని కెఫీన్‌ జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే ఆకలిని అరికడుతుంది. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు పొట్టలోని కొవ్వును కరిగిస్తుంది.
  • బ్లాక్ కాఫీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. బ్లాక్ కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B2, B3, B5, మాంగనీస్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియ రేటు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
  • బ్లాక్ కాఫీ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్లను విడుదలను ప్రోత్సహిస్తుంది. తద్వారా రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండగలుగుతారు.
  • కాఫీలో యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్‌ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • కెఫిన్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో ఆడ్రినలిన్ స్థాయిని పెంచుతుంది. ఫైట్ హార్మోన్ అని కూడా పిలువబడే ఈ హార్మోన్ కారణంగా శరీరం బలంగా తయారవుతుంది.
  • బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో టాక్సిక్ లివర్ ఎంజైమ్‌ల స్థాయి తగ్గుతుంది. ఫలితగా క్యాన్సర్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఆల్కహాలిక్ సిర్రోసిస్‌తో సహా పలు కాలేయ సమస్యలను నివారించవచ్చు.
  • బ్లాక్ కాఫీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే జ్ఞాపకశక్తికి సంబంధించి వ్యాధులైన అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్‌ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.