NRI-NRT

నాటా: టాలీవుడ్ స్థాయి పెరిగింది. 2వ రోజు వేడుకలో నటుడు ఆలీ.

NATA Day2 Closing: Ali Praises Tollywood.

ఒకప్పుడు తెలుగుకు పరాయి భాష చిత్రాల ప్రమోషన్లు చేస్తే అదే గొప్పగా భావించేలా ఉండేదని, కానీ ఇవాళ తెలుగు సినిమా కావాలని వెంపర్లాడే రోజులు వచ్చాయని సినీ నటుడు ఆలీ అన్నారు. డల్లాస్‌లో నాటా 2023 మహాసభల 2వ రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. టాలీవుడ్ స్థాయి పెరిగిందని, నేపాలీలు, సుడానీయులు తెలుగు నటులు, కమెడీయన్లకు అభిమానులుగా మారుతున్నారంటే మన సినిమా స్థాయి పాన్-ఇండియా నుండి పాన్-గ్లోబల్‌కి ఎదిగిందని అన్నారు. అనంతరం అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తదితరులు ఆయన్ను సత్కరించారు.


12వేల మంది సామర్థ్యం కలిగిన సభాప్రాంగణం జనసందోహంగా మారింది. ఈ వేడుకకు 10వేలకు పైగా ప్రవాస అతిథులు హాజరయ్యారని అంచనా. మూడో రోజు శ్రీనివాస కళ్యాణంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. థమన్ ధమకాను ప్రేక్షకులు ఉత్సాహంగా ఆస్వాదించారు. నాటా ఐడల్ విజేతలను ప్రకటించారు. కార్యవర్గ సభ్యులను, దాతలను సత్కరించారు. ఎస్పీబీకి నివాళి పేరిట ప్రదర్శించిన కార్యక్రమం ఆకట్టుకుంది. శోభాంజలి, కైలాసా, విశ్వనాథామృతం తదితర నృత్యాలు అలరించాయి.



రెండో రోజు ముగింపు వేడుకల్లో తితిదే ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, నటి లయ, డా.పైళ్ల మల్లారెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, వైకాపా నేతలు, పలు జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.