Politics

రేపు FTCCI ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్న కేటీఆర్

రేపు  FTCCI ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్న కేటీఆర్

ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రకటించింది. 22 విభాగాల్లో ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రధానం చేయనున్నారు. 23 విభాగాల్లో అవార్డులను ప్రధానం చేయడానికి నామినేషన్లు కోరగా 22 విభాగాల్లో దరఖాస్తులు అందాయని ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. సోమవారం జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ అవార్డులను అందజేయనున్నారు. ఆల్‌రౌండ్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎగుమతుల విభాగంలో నవ లిమిటెడ్‌, సీఎ్‌సఆర్‌ విభాగంలో మై హోమ్‌ ఇండస్ట్రీ్‌సకు ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డులు లభించాయి.