Business

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఉత్తరాఖండ్ లో మండిపోతున్న టమాటా ధర

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ధర మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ లో కేజీ టామాటా రూ. 250గా ఉంది. ఉత్తరకాశీ జిల్లాలో కేజీ ధర రూ. 180 నుంచి 200 వరకు ఉంది. ఈ సందర్భంగా ఓ వ్యాపారి స్పందిస్తూ… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా టమాటా ధరలు పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ధరలతో టామాటా కొనడానికి ప్రజలు పెద్దగా ఇష్టపడటం లేదని అన్నారు.

*  మీ ఇంట్లో ఈ మసాలా పండించండి

చాలా మంది తోటలో లేదా ఇంటి ప్రాంగణంలో కూరగాయలు విత్తడం, పువ్వులు పెంచడం చాలా ఇష్టపడుతారు. ఆ వ్యక్తులు మార్కెటింగ్ కోసం ఈ పని చేయకపోయినా, వారి లక్ష్యం తాజా కూరగాయలను పొందడం. మీరు కూడా ఇలా చేస్తే, కూరగాయలతో పాటు మీ ఇంటి ప్రాంగణంలో కొన్ని ప్రత్యేక మసాలా దినుసుల సాగు కూడా చేయవచ్చు. దీనివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందు గోల్డ్ కొనడానికే ఆసక్తి చూపుతుంటారు. కాగా, నేడు వారికి షాక్ తగిలిందనే చెప్పవచ్చు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,150 ఉండగా, నేడు 100 పెరగడంతో గోల్డ్ ధర రూ.54,250గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,060గా ఉండగా, నేడు 100 పెరగడంతో గోల్డ్ ధర రూ.59,160గా ఉంది.

*  యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోన్న సలార్ టీజర్

ప్రభాస్ నటించిన సలార్ టీజర్కు యూట్యూబ్లో భారీ స్పందన వస్తోంది. 27 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయి వ్యూస్ దక్కించుకున్న తొలి టీజర్ ఇదేనని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆదిపురుష్ (69M), KGF2(68.83M), రాధే శ్యామ్(42.6M) సాధించాయని చెబుతున్నారు. కాగా, సలార్ టీజర్ 100M వ్యూస్ దిశగా వెళుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో 30 సెకన్లలోనే ₹5 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌

ప్రమఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఇకపై వ్యక్తిగత రుణాలూ (personal loans) ఇవ్వనుంది. ఇందుకోసం యాక్సిస్‌ బ్యాంక్‌తో (Axis Bank) జట్టు కట్టింది. ఇప్పటికే ఈ రెం డు సంస్థలూ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చాయి. తాజాగా పర్సనల్‌ లోన్‌ విభాగంలోకీ అడుగుపెట్టాయి. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన వ్యక్తిగత రుణాలను ఇకపై ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులు పొందొచ్చు

టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై హైదరాబాదులో ఐటీ శాఖ మీడియా సమావేశం

TDS రీఫండ్ కుంభకోణంపై విచారణ కొనసాగుతోందని IT శాఖ కమిషనర్ మితాలి మధుస్మిత తెలిపారు. తప్పుడు సమాచారంతో ఎందరు రీఫండ్ తీసుకున్నారో ఇప్పుడే చెప్పలేమని.. ఆధారాలు అప్లోడ్ చేయకుండానే రీఫండ్ తీసుకున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వీరిలో ఉన్నారని.. అనుమానితులను విచారించామని పేర్కొన్నారు. కాగా, టీడీఎస్ రీఫండ్ కుంభకోణంలో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఐటీశాఖ గుర్తించింది.

విశాఖలో రూ. 90 లక్షల విలువైన రూ. 2వేల నోట్లతో పట్టుబడిన వ్యక్తి

విశాఖపట్టణంలో రూ. 90 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లతో పట్టుబడిన వ్యక్తిని బెదిరించి రూ. 12 లక్షలు లాక్కున్న ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీతమ్మధార ప్రాంతంలో రాత్రిపూట విధుల్లో ఉన్న స్వర్ణలత బృందానికి సూరిబాబు అనే వ్యక్తి రూ. 90 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లు తీసుకెళ్తూ దొరికాడు.సూరిబాబును బెదిరించిన సీఐ అతడి నుంచి రూ. 12 లక్షల విలువైన నోట్లు తీసుకుని విడిచిపెట్టారు. ఈ ఘటనపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్ కలిసి విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వర్ణలత డబ్బులు తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆమెతోపాటు శ్యాంసుందర్ అలియాస్ మెహర్, శ్రీనుపైనా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోట్ల మార్పిడికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుపైనా కేసు నమోదు చేశారు.

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

 గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109

                      లీటర్ డీజిల్ ధర రూ.97

విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ.110

                        లీటర్ డీజిల్ ధర రూ.99

మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్‌ హీరోలు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ట్విటర్’ ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త ‘థ్రెడ్స్‌’ (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్‌ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు..ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్‌ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు.

* ఎల్ఐసీ ఆస్తులు 45 లక్షల కోట్లు

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక 5 నెలల క్రితం వచ్చింది. ఆ తర్వాత అదానీ గ్రూప్‌కు చెందిన ఎల్‌ఐసీ షేర్లు కూడా క్షీణించాయి. అదానీ గ్రూప్‌ షేర్లలో ఎల్‌ఐసీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టిందని అప్పట్లో దుమారం రేగింది. దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్‌లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నదని దేశంలోని చాలా మందికి తెలిసింది. దేశంలోని చాలా మంది సామాన్యులకు దీని గురించి తెలియదు.. దాని వివిధ పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. LIC దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ.. మార్చి 2023 నాటికి LIC ఆస్తులు రూ. 45.7 లక్షల కోట్లు కాగా, దేశంలోని మొత్తం బీమా పరిశ్రమ రూ. 60 లక్షల కోట్లు.