Business

వడ్డీ రేట్లు పెంచిన HDFC-TNI నేటి వాణిజ్య వార్తలు

వడ్డీ రేట్లు పెంచిన HDFC-TNI నేటి వాణిజ్య వార్తలు

2వేల నోట్ల మార్పిడి కేసులో ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్ల ( Two thousand notes ) మార్పిడి ( Exchange ) కి విధించిన గడువు సమీపిస్తున్న కొద్ది ఆ నోట్ల మార్పిడికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కంటే కొసరు నయమన్నట్లుగా పెద్దమొత్తంలో ఉన్న రూ.2వేల నోట్లను మధ్యవర్తులకు కమీషన్‌ ఇచ్చి తక్కువ నగదును వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి నోట్ల మార్పిడి విషయంలో జోక్యం చేసుకుని అసలు వ్యక్తులకు మోసం చేసిన ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ ( Inspector ) తో పాటు ఇద్దరు హోంగార్డులు, మధ్యవర్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.విశాఖలో జరిగిన ఘటన వివరాలను విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమవర్మ (Police Commissinor) శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రిటైర్డ్‌ నావెల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌ తమ వద్ద ఉన్న రూ.90లక్షల విలువగల రూ. 2 వేల నోట్లను మార్పిడికి మధ్యవర్తి సూరిబాబును ఆశ్రయించారు. తమకు రూ.90లక్షలు రూ.500 నోట్లు ఇస్తే రూ. కోటి రూ. 2000 నోట్లను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. నగదు మార్పిడిలో సమస్యలు రావడంతో సూరిబాబు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్న శ్యామ్‌సుందర్‌, శ్రీనును ఆశ్రయించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ నియంత్రణపై చర్చలు:కొత్త రూల్స్

ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది.ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్‌‌కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది.

తమిళనాడులో కొత్త పథకం.. గృహిణులకు ప్రతినెలా రూ.1,000

గృహిణులకు ప్రతి నెలా రూ.1,000 అందించే పథకాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. పకడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. DMK ఫౌండర్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 21 ఏళ్లు నిండి, కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్నవారు అర్హులని తెలిపారు.

నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించిన ధరల ప్రకారం శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.72 వద్ద విక్రయిస్తుండగ,  డీజిల్ ధర లీటరుకు రూ.89.62 వద్ద ఉంది.ముంబైలో పెట్రోల్ ధర   లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ.94.27 వద్ద ఉన్నాయి.మీరు పెట్రోల్ పంప్‌లో చెల్లించే పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు వసూలు చేస్తాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్నును వసూలు చేస్తాయి.

లాభాల్లో రారాజు సింగరేణి

తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శాతం అధికమని పేర్కొంది. అలాగే 2021- 22 సంవత్సరంలో రూ.26,585 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..తరువాత ఏడాది రూ.33,065 టర్నోవర్‌ సాధించింది. వృద్ధి పరంగా చూస్తే ఇది 214 శాతం అధికమని తెలిపింది. గతేడాది 67.14 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సంస్థ..66.69 మిలియన్‌ టన్నుల బొగ్గును విక్రయించింది.

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు, మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు నేడు తగ్గాయి. హైదరబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,250 ఉండగా, నేడు 100 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.54,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,160 ఉండగా, నేడు 90 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,070గా ఉంది.

భ‌గ్గుమంటున్న టమాటా ధరలు

దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. టమాటా కిలో రూ.180కి చేరుకుంది. ప‌లు ప్రాంతాల్లో అయితే కేజీ టమాటా ధ‌ర రెండు వంద‌లు దాటింది. ఈ క్ర‌మంలోనే మెక్‌డొనాల్డ్స్  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి నుంచి త‌మ బ‌ర్గ‌ర్ ల‌లో టమాటాలు ఉండ‌వ‌నీ, ప్ర‌స్తుతం పెరుగుతున్న టమాటా ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రా లోటు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. జాతీయ రాజధానిలోని ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ ఉత్తర-తూర్పు శాఖలు తాత్కాలిక కాలానుగుణ సమస్య కారణంగా టమాటాలు లేకుండా వంటకాలను అందించే చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. సీజనల్ సమస్యల కారణంగా మెనూ ఐటమ్స్ లో టమాటాలు వుండ‌వ‌ని ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ ప్రతినిధి శుక్రవారం ప్రచురించిన ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు.

రుషికొండ బీచ్ కు రూ.20 ఎంట్రీ టికెట్

 విశాఖపట్నంలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్కు వెళ్లాలంటే ఇక నుంచి ఎంట్రీ టికెట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. జులై 11 నుంచి రూ.20 వసూలు చేస్తామని, 10 ఏళ్ల లోపు పిల్లలకు రుసుము తీసుకోమని చెప్పారు. ఈ టికెట్తో పర్యాటకులు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్ జోన్, ఆటస్థలం వినియోగించుకోవచ్చని.. అయితే పార్కింగ్ కోసం అదనంగా ఫీజు ఉంటుందని తెలిపారు.

పడిపోతున్న ChatGPT

 టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ యాప్ రోజురోజుకు భారీగా యూజర్లను కోల్పోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ఈ యాప్ లాంచ్ అయిన 2 నెలల్లో 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ప్రశ్నలకు ఆన్సర్ చెప్పడం, ప్రోగ్రామ్స్ రాయడం మొదలగు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండి యూజర్లకు సహకరిస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అయితే రానున్న కాలంలో ఇది మరిన్ని సంచలనాలకు తెరలేపుతుందని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం దీని గ్రాఫ్ భారీగా పడిపోతుంది.సిమిలర్ వెబ్(Similarweb) నివేదిక ప్రకారం, చాట్‌జీపీటీ యాప్ ట్రాఫిక్ జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా 9.7శాతం తగ్గింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడే వారి సంఖ్య 5.7 శాతం తగ్గింది. అమెరికాలో ఈ యాప్ ట్రాఫిక్ భారీగా క్షీణతను ఎదుర్కొంది. అక్కడ నెలవారీ క్షీణత 10.3 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్‌లో సందర్శకులు గడిపిన సమయం కూడా 8.5 శాతం తగ్గినట్లు సిమిలర్ వెబ్ నివేదిక తెలిపింది.

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌

వందేభారత్‌ సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్‌ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లతో పాటు అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లలో ఆక్యుపెన్సీని బట్టి రైల్వే టికెట్లపై 25 శాతం వరకు రేట్లు తగ్గిస్తామని వెల్లడించింది. టికెట్ ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ లభిస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌ ఛార్జ్, జీఎస్టీ ఇతర ఛార్జీలు విడివిడిగా విధిస్తారని తెలిపింది. తక్షణమే ఈ రాయితీ స్కీం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. హాలిడే స్పెషల్ ట్రైన్స్, ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ లో ఈ పథకం వర్తించదని  రైల్వే బోర్డు తేల్చి చెప్పింది.రైళ్లలో ఏసీ సీటింగ్‌ కు సంబంధించిన టికెట్లపై రాయితీ పథకాలను ప్రవేశపెట్టే అధికారాలను రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సీట్ల లభ్యత ఆధారంగా రాయితీ స్కీంలకు  ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లు రూపకల్పన చేస్తారని రైల్వే బోర్డు తెలిపింది. గత 30 రోజులలో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది.

వడ్డీ రేట్లు పెంచిన HDFC

HDFC బ్యాంకు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(MCLR) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన రేట్లు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన లోన్స్పై 15 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీ రేటు 8.10%కి చేరింది. నెల రోజుల రుణాలపై 10 బేసిస్ పాయింట్లు పెంచగా.. వడ్డీ రేటు 8.30%కి చేరింది. 3 నెలల రుణాలకు 8.6%, 6నెలల రుణాలకు 8.9%కి చేరింది. ఏడాది రుణాలకు 9.05%గా ఉంది.