Business

అదానీ బ్రిడ్జిని దొంగిలించిన దొంగలు

అదానీ బ్రిడ్జిని దొంగిలించిన దొంగలు

దొంగల కన్ను పడింది అంటే దాన్ని వెంటనే లేపేయాల్సిందే. అది బంగారమైనా, వెండి అయినా..ఆఖరికి ఇనుము అయినా సరే..అది అదానీదైనా..అంబానీదైనా సరే..అలా దొంగలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన ఓ బ్రిడ్జీని లేపేశారు. గౌతమ్ అదానీ కంపెనీకి చెందిన ఓ ఇనుప బ్రిడ్జీని మాయం చేసేశారు. 90 అడుగుల పొడుగున్న బ్రిడ్జీ 6,000 కిలోల ఇనుప బ్రిడ్జీని మాయం చేసేశారు.ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకుపోయారు దొంగలు. ఇదికాస్తా అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం దృష్టికి వెళ్లటంతో వారు షాక్ అయ్యారు. అదేదో నిర్మానుష్య ప్రాంతంలో ఉండేది కాదు ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గంలో 90 అడుగుల పొడవున్న ఇనుప బ్రిడ్జీని ఎత్తుకుపోయారంటే వాళ్లు మామూలు దొంగలై ఉండరు. అదానీ కంపెనీకి చెందిన సంబంధిత వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అదానీ బ్రిడ్జీనే దొంగిలిస్తారా మరి. అలా రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వారిని విచారించారు.

అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 2022 జూన్‌ నెలలో మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ కాలువపై ఇనుప వంతెన్ని తాత్కాలికంగా నిర్మించింది. అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ వైర్లను తరలించేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో అదే కాలువపై మరో వంతెన నిర్మించారు. దీంతో కొత్త బ్రిడ్జీ అందుబాటులోకి రావటంతో అదానీ బ్రిడ్జీ నిర్మించిన ఆ ఇనుప వంతెన వినియోగించటం తగ్గిపోయింది. అలా క్రమేపీ ఆ వాడకం తగ్గిపోయింది. దీంతో దొంగల కన్ను ఆ బ్రిడ్జీపై పడింది. ఎలా ఎవరు వాడటంలేదు దీన్ని లేపేయానుకున్నారేమో..అలా పక్కాగా ప్లాన్ వేసి ఏకంగా 90 అడుగుల పొడవున 6,000 కిలోల ఇనుమును లేపేశారు. పైగా రద్దీగా ఉండే ప్రాంతంలో వంతెననే మాయం చేశారంటే వాళ్లు మామూలు దొంగలై ఉండరని ఊహించుకోవచ్చు. ఈ వంతెనను ఎవరూ వినియోగించకపోవడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అలా అక్కడ ఓ వంతెన ఉండేది కదా ఇప్పుడు కనిపించటంలేదేంటీ..అని కొంతమందికి అనుమానం వచ్చింది. అలా జూన్ 26న అక్కడ ఉండే వంతెన మాయం అయినట్లుగా గుర్తించారు స్థానికులు.కానీ ఎప్పుడూ వాహనాలు, ప్రజల రాకపోకలతో ఫుల్ రష్ గా ఉండే మలాడ్ ప్రాంతంలో బ్రిడ్జిని దొంగలు మాయం చేయటంతో స్థానికులు, పోలీసులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యంతో సహా అందరు నోరెళ్లబెట్టారు. వార్నీ ఏమీ ఈ దొంగల చాతుర్యం అన్నట్లుగా ఆశ్చర్యపోయారు. వంతెన దొంగతనానికి గురైనట్లు గుర్తించిన అదానీ సంస్థ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బ్రిడ్జిని వంతెనను ముక్కలుగా చేసి తరలించినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ నలుగురిలో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది.సదరు నిందితు ఈ వంతెన నిర్మించినప్పుడు అదానీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసాడని అలా ఆనూపాను బాగా తెలిసి ఈ చోరీలో అతను భాగస్వామి అయ్యాడని పోలీసుల విచారణలో గుర్తించారు. మిగిలిన ముగ్గురు సదరు వ్యక్తి సహకరించి మరికొందరు సహాయంతో బ్రిట్జీని మాయం చేశారు. వీరితో పాటు ఈ చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే చోరీకి గురి అయిన ఇనుములో చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు.