Editorials

కాళ్ళు సరిగ్గా కడుక్కోమని ఇందుకే అంటారు

కాళ్ళు సరిగ్గా కడుక్కోమని ఇందుకే అంటారు

మన శరీరంలో లక్ష్మీదేవి చెవి తమ్మెల్లో, కాలి చీలమండలో నివాసం ఉంటుందని అంటారు. ఈ రెండుచోట్లనే ఎందుకు ఉన్నదంటే, తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవాళ్లు పనిమంతులు. ఆర్జించగలరు. కనుక వినే చెవులు లక్ష్మికి ఆవాసాలయ్యాయి. ఇక చీలమండలను సంస్కృతంలో ‘ఉశనం’ అంటారు. ఇది భోగభాగ్యాలకు, ఆరోగ్యానికి, నిత్యకర్మలకు, ఉద్యోగ విధులకు కారణమైన శనీశ్వరుడి స్థానం. అందుకే చీలమండలు తడిసేలా కాళ్లు కడుక్కోవాలనే సంప్రదాయం ఏర్పడిరది. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది. స్థూలంగా పరిశుభ్రత ఉన్నచోటనే లక్ష్మీదేవి నివసిస్తుంది. లక్ష్మీదేవిని రాత్రివేళల్లో ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుంది. దీనికి సూచిక ఆమె పగటిపూట చూడలేని (దివాంధ ప్రాణి) గుడ్లగూబను తన వాహనంగా చేసుకోవడం. ధర్మార్థకామమోక్షాలను ఆశించే యోగులు రాత్రి నిశ్శబ్ద వేళలో మేల్కొని ధ్యానముద్రలో ఉంటారు. అలాంటి వారంటే తనకు ప్రీతి అని చెప్పడానికే ఆమె ఉలూకం అనే గుడ్లగూబను తన వాహనంగా చేసుకుంది.