Devotional

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు ఎలాంటి పూజలు చేయకూడదంటారు పెద్దలు. దైవ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. కనీసం చందాలు, విరాళాలు కూడా ఇవ్వకూడదని అంటుంటారు. ఆ ఏడాది ఇంట్లో దేవుడికి దీపం కూడా పెట్టరు. మరికొందరు వారి నీడ కూడా పడకుండా దేవుని ఫొటోలను మూట కట్టి అటక మీద పెట్టేస్తారు. సంవత్సరికం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాక దేవుడి ఫోటోలను తీసి శుభ్రంగా కడిగి.. ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత పూజలు చేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని, ఇలా చేయాలని ఏ శాస్త్రం చెప్పలేదని అంటున్నారు నిపుణులు.

పూజలు చేయకుండా, దైవం ముందు దీపం పెట్టని ఇల్లు స్మశానంతో సమానం. ఎందుకంటే దీపం శుభాలకు సంకేతం. ఎక్కడైతే మనస్ఫూర్తిగా దీపారాధన చేస్తారో, అక్కడ దేవుడు కొలువై ఉంటాడు. అందుకే ప్రతి ఇంట్లో దీపారాధన కంపల్సరీ.ఇక చనిపోయిన వారింట్లో ఆ ఏడాది పాటు దైవ సంబంధిత కార్యాలు, సేవా కార్యక్రమాలను ఆపకూడదు. ఎందుకంటే ఆ ఏడాదిలో చేసిన దైవకార్యాలు, విరాళాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ దాన ధర్మాలు, దైవకార్యం విరాళాల వలన పైలోకంలో ఉన్న పితృదేవులకు శాంతి కలుగుతుంది. అంటే మన తాత, ముత్తాతల ఆత్మలకు మన:శాంతి కలుగుతుంది. దీని ద్వారా వంశ వృద్ధి కలుగుతుంది.అందుకే మరణం సంభవించిన ఇంట్లో 11 రోజులు మాత్రమే పూజలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అంతేకానీ ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఎలాంటి పూజలు చేయకూడదని, ఆలయాలకు వెళ్లకూడదని ఏ శాస్త్రం చెప్పలేదు. కానీ కొత్త కార్యక్రమాలు మాత్రం ప్రారంభించకూడదు.