Kids

ఏ వయసులో పిల్లలకు ఫోన్లు ఇవ్వాలి, నిపుణులు ఏమంటున్నారు?

ఏ వయసులో పిల్లలకు ఫోన్లు ఇవ్వాలి, నిపుణులు ఏమంటున్నారు?

ఈరోజుల్లో ఎక్కడ చిన్నపిల్లలను చూసినా వారి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్ ఉంటుంది. అసలు ఫోన్‌ లేకపోతే వాళ్లు ఏడ్చేస్తున్నారు. మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఫోన్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి పాటలు పెట్టేస్తారు. ఇది చూసి మీరు మురిసిపోవచ్చు. కానీ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడమే అంటే స్లో పాయిజన్‌ ఇవ్వడమే.! అసలు పిల్లలకు ఏ వయుసు వచ్చాక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు.స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా పిల్లలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి, ఇది వారి సాధారణ మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎంత ఆలస్యంగా స్మార్ట్‌ఫోన్ లేదా సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తే అంత మంచిదని నిపుణులు అంటున్నారు.

11, 15 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,300 మంది బాలికలలో 60 శాతం మంది అపరిచితులు, స్నాప్‌చాట్ వినియోగదారుల నుంచి అసౌకర్య సందేశాలను అందుకున్నారని కనుగొన్నారు. టిక్‌టాక్ వాడకం విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ బాలికల సంఖ్య 45 శాతంగా ఉంది. సోషల్ మీడియాలో పిల్లలకు సరిపడని కంటెంట్ ఉంది. ఇందులో హింసతో పాటు లైంగికత కూడా ఉంది.. దీని వల్ల పిల్లలు కూడా తమను తాము హాని చేసుకోవచ్చు. అలాగే ప్రతి ప్లాట్‌ఫారమ్ ఇన్‌బాక్స్ చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది చెడు ఉద్దేశాలతో చెడు సందేశాలు పంపుతారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అసలు పిల్లలు అన్నం తినడం లేదని ఫోన్‌ ఇవ్వడం వల్లే వారికి ఫోన్‌ తెలుస్తుంది. మీరు వారికి ఫోన్‌ గురించి ఏమాత్రం తెలియకుండా పెంచగలగాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్‌ను అవసరం లేకున్నా వాడకూడదు. కేవలం వారి దృష్టిలో ఫోన్‌ అంటే ఇతరులతో మాట్లాడుకోవాడనికి వాడే ఒక పరికరం అని మాత్రమే మనం నేర్పించాలి. ఏవేవో గేమ్స్‌ అన్ని ఆడుకోవడానికి ఫోన్‌ ఇచ్చి వారి లేత లేత కళ్లను, బ్రెయిన్‌ను మీరే నాశనం చేస్తున్నారు. బాధ్యతగల ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారిని వాటికి బానిసలు చేయరు మరీ.!