Fashion

పులిపిర్లు పోవాలంటే ఇవి రాయాల్సిందే

పులిపిర్లు పోవాలంటే ఇవి రాయాల్సిందే

 మనలో చాలా మందికి పులిపిర్లు వస్తుంటాయి. ఇవి ఎక్కువగా మెడ, కనురెప్పల మీద ఏర్పడతాయి. చర్మం కింద మందంగా ఉన్న భాగాల్లో పులిపిరికాయలు ఏర్పడుతాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఆభరణాలు వేసుకునేటప్పుడు దురద వస్తుంటుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలను పాటించండి. అవేంటో ఇక్కడ చూద్దాం

1. పులిపిరికాయ‌పై అరటి తొక్కతో మర్దనా చేస్తే.. పులిపిరికాయ‌లు ప‌డిపోతాయి.

2. విట‌మిన్ – E ఆయిల్‌ను పులిపిర్లపై మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయడం వలన 7 రోజుల్లో పులిపిరికాయ‌లు రాలిపోతాయి.

3. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణం కలిగి ఉంటుంది. దీనిలో ఉండే జిగురును తీసి పులిపిర్లపై రాస్తే చాలు.

4. వెల్లుల్లి ఉండే ఎల్లిసిన్ బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లు రాలి పోయేందుకు ఇది సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకుని మిక్సీలో వేసి పేస్టుగా చేసి దాన్ని పులిపిర్లు ఉన్నచోట రాస్తే.. అవి రాలిపోతాయి.