Health

ఎర్ర తోటకూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

ఎర్ర తోటకూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

 ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఆకుకూర‌లు కూడా ఒకటి. ఆకుకూర‌ల్లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. వాటిలో ఎర్ర తోట కూర మన సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ఎందుకంటే వీటిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు ఎర్ర తోట‌కూర‌ను తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచించారు. దీన్ని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

1.ఎర్ర తోటకూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్ కూడా అదుపులో వుంటుంది.

2. రక్తం తక్కువగా ఉన్న వారు దీన్ని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

3. అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఎర్ర తోటకూర తింటే మంచిది. ఎందుకంటే, ర‌క్త పోటు స్థాయిల‌ను అదుపు చేయ‌డంలో ఇది సహాయప‌డుతుంది.

4. దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే ప్రమాదకర గొంతు క్యాన్సర్ రాకుండా దోహదపడుతుంది.

5. సీజనల్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్ర తోట కూడా పోరాడుతుంది.

6. దీనిలో ఉండే కాల్షియం ఎముక‌లు, దంతాలు దృఢంగా మారేలా చేస్తాయి.