DailyDose

లొకేష‌న్ సైతం ట్రాక్ చేస్తున్న హ్యాక‌ర్లు

లొకేష‌న్ సైతం ట్రాక్ చేస్తున్న హ్యాక‌ర్లు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో లోపాలను ఎత్తి చూపారు పరిశోధకులు. ఈ లోపంతో హ్యాకర్లు వినియోగదారుల ఫోన్ నెంబర్ల ద్వారా లోకేషన్ ఈజీగా కనుగోనే అవకాశం ఉందని చెప్తున్నారు. 1990 ప్రారంభం నుంచి మొబైల్ ఫోన్ లలో టెక్ట్సింగ్ SMS సిస్టమ్ నుంచి సేకరించిన డేటాకు ఆధునాతన మేషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్వయించడం ద్వారా ఈ విషయం బయటపడింది. పదే పదే వచ్చే అన్ వాంటెడ్ మేసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.యూఎస్ లోని ఈశాన్య విశ్వవిద్యాలయం PhD విద్యార్థి ఇవాంజెలోస్ బిట్సికాస్ నేతృత్వంలో ఓ పరిశోధనా బృందం ఈ లోపాన్ని బహిర్గతం చేసిందరి ఈశాన్య గ్లోబల్ న్యూస్ తెలిపింది. వినియోగదారుడి ఫోన్ నంబర్, సాధారణ నెట్‌వర్క్ యాక్సెస్‌ను కలిగి ఉండటం ద్వారా బాధితుడి లోకేషన్ గుర్తించవచ్చని బిట్సికాస్ చెప్పారు.చివరికి వినియోగ దారులు ప్రపంచంలో ఎక్కడున్నా ట్రాక్ చేయడానికి వీలుంటుందని బిట్సికాస్ తెలిపారు.

పరిశోధనా బృందం నివేదిక ప్రకారం.. కమ్యూనికేషన్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడినా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ పద్ధతి పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఈ దుర్బలత్వం కనిపించిందన్నారు. “ వినియోగదారుడి ఫోన్ నంబర్‌, సాధారణ నెట్‌వర్క్ యాక్సెస్‌ ద్వారా బాధితుడిని గుర్తించవచ్చు. ఇది వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చని ’’ బిట్సికాస్ అన్నారు. అయితే యాక్టివ్ ఎక్స్‌ప్లోటేషన్‌కు ఇంకా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.మూడు దశాబ్దాల క్రితం 2G నెట్‌వర్క్‌ల కోసం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు SMS భద్రత స్వల్ప మెరుగుదలలను మాత్రమే చూసింది. యూజర్లు టెక్ట్స్ మేసేజ్ ను పొందినప్పడు.. వారి ఫోన్ పంపిని వారికి తిరిగి డెలివరీ నోటిఫికేషన్ పంపుతుంది. వినియోగదారులకు ఫోన్లకు ఎక్కువ మేసేజ్ పంపడం ద్వారా హ్యాకర్లు దీనిని అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ డెలివరీ మేసేజ్ ను విశ్లేషించడం ద్వారా కమ్యూనికేషన్లు ఎన్ క్రిప్ట్ చేయబడినప్పటికీ హ్యాకర్లు వారి లోకేషన్ ను గుర్తించే అవకాశం ఉందన్నారు.

“ఒకసారి మెషిన్-లెర్నింగ్ మోడల్ స్థాపించబడిన తర్వాత హ్యకర్ కొన్ని SMS మేసేజ్ లను పంపడం ద్వారా ఫలితాలు మెషిన్-లెర్నింగ్ మోడల్‌కి అందించబడతాయి. ఇది యూజర్ ఎక్కడ ఉన్నాడో తెలుపుతుందని ” బిట్సికాస్ చెప్పారు.పదే పదే వచ్చే అన్ వాంటెడ్ మేసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు బిట్సికాస్.