Fashion

ఈ మూడు పుష్పాలు అందానికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయంట

ఈ మూడు పుష్పాలు అందానికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయంట

మన హిందూ సాంప్రదాయంలో పూలను ఎక్కువగా పూజలు చేయడానికి, స్త్రీలు తలలో పెట్టుకోవడంకోసం వాడుతూ ఉంటారు. ఆహార నిపుణులు ఎన్నో పరిశోధనలు చేసి కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ పూలు అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ఆ పూలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గులాబీ పూలు:స్త్రీలు ఎక్కువగా ఇష్టపడేపూలలో గులాబీ పూలు కూడా ఒకటి. దానికి కారణం వాటి అందమే. అలాంటి గులాబీ పూలను ఎండబెట్టి టీలో కానీ,స్వీట్స్ లో కానీ వేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు రోజూ గులాబీ పూలను ఏదో రూపంలో తీసుకోవడం మంచిది.

బొప్పాయి పూలు:బొప్పాయి చెట్టు వేరు నుంచి పూల వరకు మనకు ఉపయోగపడతాయి. డెంగ్యూ వచ్చినప్పుడు చాలా మంది ఈ పూలతో టీ చేసుకొని తాగుతుంటారు. అలాగే మధుమేహ రోగులకు ఇది మంచి మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల గుండె, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అరటి పువ్వు:అరటి పువ్వులో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. దీని వల్ల బరువు తొందరగా తగ్గుతారు. రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.