Politics

హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు నేడు షోలాపూర్‌లో పర్యటన

హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు నేడు షోలాపూర్‌లో పర్యటన

నేడు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు సోలాపూర్ పర్యటనకు వెళ్ల‌నున్నారు. మహారాష్ట్ లోని సోలాపూర్ లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి షోలాపూర్ లో స్థిరపడిన వేలాది మంది పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగనున్న ఈ రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు హాజరుకానున్నారు. అనంతరం షోలాపూర్ లో త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలన చేయనున్నారు.