Politics

టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ

టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. గ్రేటర్‌ పరిధిలోని 29 అసెంబ్లీ స్థానాలకు సుమారు 263 మంది టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది, ఆ తర్వాత కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలకు 16 మంది చొప్పున పోటీ పడుతున్నారు.

గోషామహల్‌ స్ధానానికి 15, శేరిలింగంపల్లి, చేవెళ్ల స్థానాలకు 14 మంది చొప్పున టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌ స్థానానికి 12 మంది, రాజేంద్రనగర్‌ –11 మంది, యాకుత్‌పురా, ఎల్‌బీనగర్‌– 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు.ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌ స్థానాలకు 9 మంది, మహేశ్వరం, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌లకు 8 మంది చొప్పున, మలక్‌పేట, కార్వాన్‌ స్థానాలకు ఏడుగురు చొప్పున, జూబ్లీహిల్స్‌, మేడ్చల్‌, ఉప్పల్‌, అంబర్‌పేట స్థానాలకు ఆరుగురు చొప్పున, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా స్థానాలకు ఐదుగురు చొప్పున, మల్కాజిగిరి, పరిగి ముగ్గురు చొప్పున, వికారాబాద్‌కు ఇద్దరు టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు.