Devotional

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే?

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్‌లేని సర్వదర్శనం కోసం ఏడుగంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న 64, 214 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,777 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 4.05 కోట్లు హుండీ ఆదాయంగా లెక్క తేలింది.

ద్వారకా తిరుమలలో..
ఏలూరు: చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు పవిత్రాది వాసం, రేపు పవిత్రావరోహణ నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.