Business

బ్యాంకులకు చేరిన 93 శాతం 2వేల నోట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

బ్యాంకులకు చేరిన 93 శాతం 2వేల నోట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.55,050 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి రూ.60,050 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,050,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,050నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,050,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60.

డబ్బున్నవాళ్లు నా కుమార్తె దృష్టిలో చెడ్డవాళ్లే

 ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్ర త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత వాల్టర్ ఐజాక్సన్   రచించారు. తన బయోగ్రఫీలో మస్క్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మస్క్‌ తన కుమార్తె వివియన్‌ జెన్నా విల్సన్‌ తో ఉన్న విభేదాల గురించి ఆ పుస్తకంలో చెప్పినట్లు సమాచారం.‘‘జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ. డబ్బులున్న వాళ్లందరూ చెడ్డవాళ్లలా అని భావిస్తుంది. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు. జెన్నాతో విభేదాలు రావడం చాలా బాధాకరం. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలే నన్ను ఎక్కువ బాధించాయి’’ అని మస్క్‌ పుస్తకంలో పంచుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.ఎలాన్ మస్క్‌ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్‌ – జస్టిన్‌ దంపతులకు జేవియర్‌ అలెగ్జాండర్‌, గ్రిఫ్ఫిన్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్‌ అలెగ్జాండర్‌ అమ్మాయిగా మారి తన పేరును వివియన్‌ జెన్నా విల్సన్‌గా మార్చుకుంది. తన తండ్రి తో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జెన్నా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న విడుదల అవుతుందని సమాచారం. 

బ్యాంకులకు చేరిన 93 శాతం 2వేల నోట్లు

చెలామణీలోని 93 శాతం రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్​బీఐ డేటా వెల్లడిస్తోంది. ఆగస్టు 31 నాటికి రూ. 3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు బ్యాంకుల దగ్గరకు చేరినట్లు ఆర్​బీఐ  పేర్కొంది. ఇంకా చెలామణీలో మిగిలిన రూ. 2 వేల నోట్ల విలువ రూ. 0.24 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపింది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం వెనక్కి వచ్చిన  రూ. 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనూ, మిగిలిన 13 శాతం ఇతర కరెన్సీ నోట్ల  ఎక్స్చేంజ్​ కింద వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మే 19 నాడు రూ. 2 వేల నోట్లను విత్​డ్రా చేస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 2023 నాటికి దేశంలో రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణీలో ఉండేవి. రూ. 2 వేల నోట్లను వెనక్కి ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు టైమ్‌ ఉంది. 

నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

ముడి చమురు ధరల్లో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన నగరాల్లో పాత ధరల్లోనే కొనసాగుతున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.

 దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు

ఆగస్టులో వాహన కంపెనీలు విక్రయాల్లో అదరగొట్టాయి. దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదుచేసింది. పండగల గిరాకీ, ఎస్‌యూవీలకు ఆదరణ కొనసాగడం ఇందుకు కలిసొచ్చాయి. ఆగస్టులో ప్రయాణికుల వాహన అమ్మకాలు 9.7% వృద్ధితో 3,60,897 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇంతకు ముందు 2022 సెప్టెంబరులో అత్యధికంగా 3,55,400 కార్లు విక్రయించారు. ఏప్రిల్‌-ఆగస్టులో ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రాను వెనక్కి నెట్టి మారుతీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సమయంలో పరిశ్రమ విక్రయాలు 17 లక్షలు దాటాయి. ఆగస్టులో మారుతీ మొత్తం 1,89,082 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో సంస్థ 1,65,173 వాహనాలను డీలర్లకు సరఫరా చేసింది. ఇంతకు ముందు 2020 అక్టోబరులో విక్రయించిన 1,82,448 కార్లు ఇప్పటివరకు అత్యధికంగా ఉన్నాయి. ఆగస్టులో మారుతీ దేశీయ ప్రయాణికుల వాహనాల విక్రయాలు 1,34,166 నుంచి 16 శాతం వృద్ధితో 1,56,114కు చేరాయి. ఆల్టో, ఎస్‌-ప్రెసోలతో కూడిన చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు 22,162 నుంచి 12,209 తగ్గాయి. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ల విక్రయాలు 71,557 నుంచి స్వల్పంగా పెరిగి 72,451కు చేరాయి. యుటిలిటీ వాహన విభాగంలో బ్రెజా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగాల విక్రయాలు 26,932 నుంచి 58,746కు వృద్ధి చెందాయి. ఎగుమతులు 21,481 నుంచి 24,614కు పెరిగాయి. హ్యుందాయ్‌ విక్రయాలు 15 శాతం పెరిగి 71,435 యూనిట్లుగా నమోదయ్యాయి. టయోటా కిర్లోస్కర్‌ అత్యుత్తమ నెలవారీ విక్రయాలు నమోదుచేసింది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో నిరాశపరిచింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు 11 శాతం పెరిగాయి.

*  గత పదహారు నెలల్లో కొత్తగా 650 మంది పైలెట్లు

 గత పదహారు నెలల్లో  650 మంది పైలెట్లను నియమించుకున్నామని ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఈఓ కాంప్బెల్‌‌‌‌ విల్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల మొదటి వారంలో రెండు   బోయింగ్ బీ777 పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తాయని, దీంతో యూఎస్‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌ అయ్యే సర్వీస్‌‌‌‌లు మెరుగవుతాయని వివరించారు. ఎయిర్ ఇండియా గ్రూప్ కింద ఎయిర్ ఇండియా, ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌, ఏఐఎక్స్ కనెక్ట్‌‌‌‌ ఉన్నాయి.11 బీ777ఎస్‌‌‌‌  విమానాలను లీజుకు తీసుకుంటామని కిందటేడాది ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా నార్త్‌‌‌‌ అమెరికా రూట్లలో తిప్పడానికి వీటిని తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు  ఎప్పటి నుంచో గ్రౌండ్‌‌‌‌కే పరిమితమైన రెండు బోయింగ్‌‌‌‌ 787 విమానాలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని కాంప్బెల్ అన్నారు.  మరోవైపు డీజీసీఏ తనిఖీలో తప్పులు దొరకడంతో కంపెనీ ముంబై, హైదరాబాద్ ట్రైనింగ్ ఫెసిలిటీలను తాత్కాలికంగా  సస్పెండ్ చేశారు.

* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 1155 నుండి ప్రస్తుతం రూ.955 ప్రజలకు అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ ముడి చమురు సంస్థలు మరో గుడ్ న్యూస్ చెప్పాయి.19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను 157.50 తగ్గించాయి. వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా నిర్ణయంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1680 నుంచి రూ. 1522 కు చేరింది. వరుసగా సిలిండర్ ధరలు తగ్గడంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్: రూ. 955.వరంగల్: రూ. 974.విశాఖపట్నం: రూ. 912.విజయవాడ: రూ.927.గుంటూర్: 944.50

మారుత్‌ డ్రోన్స్‌ రూపొందించిన ఏజీ-365ఎస్‌కు డీజీసీఏ ధ్రువీకరణ

డ్రోన్ల తయారీ సంస్థ మారుత్‌ డ్రోన్స్‌ రూపొందించిన ఏజీ-365ఎస్‌కు డీజీసీఏ ధ్రువీకరణ లభించింది. చిన్న, మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో నడిచే ఈ డ్రోన్‌ను వ్యవసాయంలో, డ్రోన్‌ శిక్షణ కోసం వినియోగించేందుకు అనుమతి పొందింది. ఇలా రెండు ధ్రువీకరణలను అందుకున్న తొలి డ్రోన్‌ ఇదేనని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ పేర్కొన్నారు. 25 కిలోల కంటే తక్కువ విభాగంలో ఎన్నో నాణ్యతా తనిఖీలను తమ డ్రోన్‌ పూర్తి చేసిందని తెలిపారు. 22 నిమిషాలపాటు ఎగిరే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్‌ పంటపొలాల్లో సులభంగా మందులను పిచికారీ చేస్తుందన్నారు. ఆర్‌పీటీఓ శిక్షణా అకాడమీల్లోనూ వినియోగించొచ్చని అన్నారు. వీటి కొనుగోలుకు అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ నుంచి 4-6% వడ్డీతో  రూ.10 లక్షల వరకూ ఎలాంటి హామీ అవసరం లేని రుణాలను పొందొచ్చని చెప్పారు.

వినియోగదారులకు షాకిచ్చిన ఈ రెండు బ్యాంకులు

మరో రెండు బ్యాంకులు ఖాతాదారులకు పెద్ద షాకిచ్చాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రుణ వడ్డీ రేట్లను పెంచారు. రెండు ప్రధాన బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) పెంచాయి. రెండు బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ని 5 బేసిస్ పాయింట్లు పెంచాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2023 నుండి అంటే శుక్రవారం నుండి అమలులోకి వచ్చాయి.ఈ పెంపు తర్వాత, గతంలో లేదా భవిష్యత్తులో కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసిన బ్యాంక్ కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రుణ వడ్డీ రేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకోండి.దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచి కోట్లాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.50 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.85 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది.