Sports

47వ సారి సెమీస్ చేరిన జకోవిచ్. సరికొత్త రికార్డు.

47వ సారి సెమీస్ చేరిన జకోవిచ్. సరికొత్త రికార్డు.

ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనూ ఫైనల్‌ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్‌ సీజన్‌ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు.