NRI-NRT

న్యూజెర్సీలో OFBJP సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay Participates In OFBJP New Jersey Event

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్ర‌భుత్వం విమోచన దినోత్సవం జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్‌ విస్మరించటం తగదు అని పేర్కొన్నారు. ఎన్ఆరైలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఇండియాను భార‌త్‌గా ప్రస్తావించాల‌ని ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ కోరారు.

ఈ కార్యక్రమములో అఫ్-బీజేపీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ కోశాధికారి శాంతా కుమార, తెలంగాణ బీజేపీ కార్యదర్శి జయ శ్రీ, వంశీ యంజాల (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ రెడ్డి (తెలంగాణ అఫ్-బీజేపీ మీడియా కో-కన్వీనర్ ), గోవింద్ రాజ్, ప్రవీణ్ తడకమళ్ల , ప్రవీణ్ అండపల్లి , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగొ, సంతోష్ రెడ్డి లింగాల, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, శంకర్ రెడ్డి, అదే విధముగా కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల , లక్ష్మి మోపర్తి , విజయ్ కుందూరు, హేమచందర్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.