DailyDose

జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర-నేరవార్తలు

జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర-నేరవార్తలు

* మాదక ద్రవ్యాల కేసులో సినీనటుడు నవదీప్‌కు నార్కోటిక్‌ విభాగం పోలీసులు గురువారం 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈనెల 23న బషీరాబాగ్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన బెయిల్‌ రద్దవడంతో.. పోలీసులు నవదీప్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్‌ చాటింగ్‌తో పాటు.. కాల్‌ డేటాను సేకరించారు. దీని ఆధారంగా నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

* జమహేంద్రవరం జైల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్‌దే బాధ్యత’’ అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

* ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా ఖండించింది. అవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని వాటిని తోసిపుచ్చింది. తీవ్రవాదులు, అతివాదులకు కెనడా సురక్షిత స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టింది. ఇక భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

* క్రెయిన్‌(Ukraine)కు పొరుగు దేశం పోలాండ్‌ (Poland) దిమ్మతిరిగే షాకిచ్చింది. ధాన్యం వివాదం ముదిరితే.. తాము భవిష్యత్తులో ఉక్రెయిన్‌కు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయలేమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పోలాండ్‌ ప్రధాని మతౌజ్‌ మోరవియోకి సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఓ పక్క రష్యాపై ఎదురుదాడులను మెల్లగా పెంచుతున్న సమయంలో పోలాండ్‌ ప్రకటన దానికి భారీ షాక్‌గా మారింది. రష్యా యుద్ధం ప్రకటించిన నాటి నుంచి చాలా దేశాలు భయపడుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా పోలాండ్‌ నిలిచింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడానికి మిగిలున్న అతి తక్కువ మార్గాల్లో పోలాండ్‌ ఒకటి. నాటో నుంచి ఇక్కడికి తరలించిన ఆయుధాలను రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్రెయిన్‌కు చేరుస్తున్నారు. దీంతోపాటు పోలాండ్‌ కూడా సొంతంగా కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిషేధాన్ని విధించింది. ఎందుకంటే చౌకగా లభించే ఉక్రెయిన్‌ ధాన్యం స్థానిక మార్కెట్లలోకి వస్తే స్థానిక రైతుల ఉపాధి దెబ్బతింటుందనే భయాలు ఈయూ దేశాల్లో ఉన్నాయి. కానీ, గత వారం ఐరోపా సమాఖ్య ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. దీనిని పోలాండ్‌, హంగేరీ, స్లోవేకియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ ధాన్యాన్ని తమ దేశంలోకి రానీయబోమని చెప్పాయి. మరోవైపు ఈ మూడు దేశాలపై ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. అంతేకాదు.. ఈ మూడు దేశాలపై దావాలు కూడా దాఖలయ్యాయి.

* ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్‌ హత్యపై కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని అమెరికా సూచించింది.

* కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను దుండగులు దారుణంగా నరికి చంపారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి వీరకృష్ణను హత్య చేయగా.. నడిరోడ్డుపైనే అతడి భార్య వరలక్ష్మిని కిరాతకంగా నరికి చంపారు.

* ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనం కోసం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సాయిరామ్‌ (31) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో.. యశ్వంత్, సాయిరామ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బోడుప్పల్ నుంచి బయలుదేరారు. అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై అతివేగంగా బైక్ నడిపి డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌ నడిపిన యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయిరామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

* ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఆపై లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరంగల్‌ నిట్‌ విద్యార్థిని నిస్సీ మృతి చెందింది. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు చెందిన సాయి, సుజిత్, ముర్తుజా, ఉమర్, విశాఖకు చెందిన శ్రేయగా గుర్తించారు. కాగా, మృతురాలు నిస్సీ స్వస్థలం విశాఖ. వీరంతా లక్నవరం విహారయాత్రకి వెళ్లి వస్తుండగా, ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* న‌గ‌రాల్లో అన్ని వ‌స‌తుల‌తో అందుబాటు రెంట్‌లో ఇల్లు లేదా ఫ్లాట్‌ను వెతికిప‌ట్టుకోవ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. దీనికోసం బ‌డ్జెట్ లెక్క‌ల‌తో పాటు ఎంతోమందిని సంప్ర‌దించి ఇండ్ల వేట చేప‌ట్సాల్సి ఉంటుంది. స‌రైన ఇంటి కోసం అన్వేష‌ణ సాగించిన పుణేకు చెందిన ఇంజ‌నీర్‌ను ఫ్లాట్ య‌జ‌మానిగా న‌మ్మించిన ఓ స్కామ‌ర్ (Cyber Fraud) ఏకంగా రూ. 3 ల‌క్షలు బురిడీ కొట్టించాడు. శ్యామ్‌లాల్‌ హ‌న్స్‌దా అనే ఇంజ‌నీర్ పుణేలోని బలేవాడిలో ఫ్లాట్‌ను రెంట్ తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో సెర్చి చేశాడు. ప్ర‌ముఖ హౌసింగ్ సొసైటీలో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రెంట్‌కు ఉంద‌నే ప్ర‌క‌ట‌న క‌నిపించింది. ప్రాప‌ర్ట వెబ్‌సైట్‌లో ఫ్లాట్ ఇమేజ్‌ల‌ను చూడ‌టంతో పాటు రెంట్ కూడా త‌న బ‌డ్జెట్‌కు త‌గిన‌విధంగా ఉండ‌టంతో యాడ్‌ను క్లిక్ చేశాడు. కొద్దిరోజుల త‌ర్వాత వాట్సాప్‌లో ప్రాప‌ర్టీ య‌జ‌మానిని తానేనంటూ శ్యామ్‌లాల్‌కు మెసేజ్ వ‌చ్చింది. రూ. 2500 టోకెన్ అమౌంట్ చెల్లించిన త‌ర్వాత ఫ్లాట్‌ను చూడాల‌ని న‌మ్మ‌బ‌లికాడు. టోకెన్ అమౌంట్ చెల్లిస్తే హౌసింగ్ సొసైటీ విజిటింగ్ పాస్‌ను జారీ చేస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. మొద‌టి నెల రెంట్ నుంచి ఈ టోకెన్ అమౌంట్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని చెప్పాడు. దీంతో స్కామ‌ర్‌ను న‌మ్మిన శ్యామ్‌లాల్ రూ. 2500 చెల్లించాడు. ఆపై సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మ‌రింత మొత్తం చెల్లించాల‌ని డిమాండ్ చేశాడు. ఇలా స్కామ‌ర్ ప‌లు కార‌ణాల‌తో బాధితుడి నుంచి ప‌లుమార్లు మొత్తం రూ. 3.6 ల‌క్ష‌లు వ‌సూలు చేశాడు. వారం రోజుల త‌ర్వాత బాధితుడు తాను చెల్లించిన మొత్తం వెన‌క్కి ఇవ్వాల‌ని స్కామ‌ర్‌కు ఫోన్ చేయ‌గా అత‌డి ఫోన్ నెంబ‌ర్ ప‌నిచేయ‌క‌పోవడంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించాడు. పెద్ద‌మొత్తంలో డ‌బ్బు పోగొట్టుకున్న బాధితుడు సైబ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించి నిందితుడిపై కేసు న‌మోదు చేశారు.