NRI-NRT

ఇర్వింగ్ MGMNT వద్ద గాంధీ జయంతి

ఇర్వింగ్ MGMNT వద్ద గాంధీ జయంతి

టెక్సాస్ రాష్ట్ర మహాత్మాగాంధీ స్మారకస్థలి (MGMNT) వద్ద గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు బాపుకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (హుస్టన్) డీసీ మంజునాథ్, డీసీకి చెందిన ప్రవాసాంధ్రుడు రవి పులి తదితరులు పాల్గొన్నారు. రవి పులిని కాన్సుల్ జనరల్ మంజునాథ్ సన్మానించారు. శాంతికి సంకేతంగా తెల్లటి పావురాలను ఆకాశంలోకి వదిలారు. బోర్డు సభ్యులు రావు కల్వల, మురళి వెన్నం, దినేష్ హూడా, కమల్ కౌశిక్, షబ్నం మొద్గిల్, శైలేష్ షా, ఉర్మిత్ సింగ్, సుష్మా మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.

2023 Gandhi Jayanthi At Irving MGMNT