NRI-NRT

అమెరికా పర్యటనలో కేశినేని శివనాధ్ (చిన్ని)

అమెరికా పర్యటనలో కేశినేని శివనాధ్ (చిన్ని)

విజయవాడ పార్లమెంట్ తెదేపా సీనియర్ నాయకులు కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము కుమార్తె వివాహం ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండోలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఆయన వివాహ వేడుకలో పాల్గొని ఆదివారం నాడు డల్లాస్‌లో తన బంధువులు, మిత్రులను కలుసుకున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని మంగళవారం నాడు న్యూజెర్సీ నుండి భారత్‌కు తిరుగు పయనమవుతానని చిన్ని తెలిపారు. ఆయన పర్యటనను ప్రముఖ ప్రవాసాంధ్రుడు సూరపనేని రాజ సమన్వయపరిచారు. డల్లాస్ పర్యటనలో చిన్నిని కలిసిన వారిలో చండ్ర దిలీప్ కుమార్, పుట్టగుంట సురేష్, కరాల శేషు, కంభంపాటి భస్వంత్, మద్దిరాల సాయి, జాస్తి శ్రీతేజ, సతీష్ అబ్బూరి, ఆదిత్య గోగినేని, లోకేష్ నాయుడు, గుళ్లపల్లి రామకృష్ణ, తొట్టెంపూడి వెంకట్ తదితరులు ఉన్నారు.

Vijayawada TDP Senior Leader Kesineni Sivanath Tours USA

👉 – Please join our whatsapp channel here – https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z