Business

సోషల్‌ మీడియాపై ఈసీ స్పెషల్‌ ఫోకస్‌- వాణిజ్య వార్తలు

సోషల్‌ మీడియాపై ఈసీ స్పెషల్‌ ఫోకస్‌- వాణిజ్య వార్తలు

సోషల్‌ మీడియాపై ఈసీ స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణలో సోషల్‌ మీడియాపై ఈసీ నజర్‌ పెట్టింది. 22 ఏజెన్సీలతో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్. సోషల్‌ మీడియాను మానిటరింగ్‌ చేస్తున్న ఈసీ.. రాజకీయ, ఇతర సోషల్‌ మీడియా వెబ్‌సైట్లపై దృష్టి సారించింది. వీడియో క్లిప్పులు, సోషల్‌ మీడియాలో పార్టీల ప్రచారంపై ఫోకస్‌ పెట్టింది. అలాగే.. మద్యం, హవాలా డబ్బు రవాణాపై కూడా ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ.

పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ. 53,650 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.58,530 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 53,650,24 క్యారెట్ల బంగారం ధర – రూ 58,530.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,650,24 క్యారెట్ల బంగారం ధర – రూ 58,530.

 భారత్‌కు విచ్చేసిన ఐఓసీ అధ్యక్షుడు 

 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌ కోసం భారత్‌కు విచ్చేసిన ఐఓసీ (IOC) అధ్యక్షుడు థామస్‌ బచ్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ సాదర స్వాగతం పలికారు. ముంబయిలోని ముకేశ్‌ నివాసానికి ఆయన మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం.. బచ్‌కు బొట్టు పెట్టి, హారతిచ్చి నీతా అంబానీ ఆహ్వానం పలికారు. అనంతరం ముకేశ్‌, నీతాతో బచ్‌ ఫొటోలు దిగారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ముంబయిలో జరగబోతోంది. అక్టోబరు 15 నుంచి 17 వరకు ఈ సెషన్‌ నిర్వహించనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సెషన్‌ నిర్వహిస్తుండడం గమనార్హం. నీతా అంబానీ ఐఓసీ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌

తమ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ మొదటి రోజున 60 శాతం ఆర్డర్లు నాన్‌-మెట్రో నగరాల నుంచే వచ్చాయని డిజిటల్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మంగళవారం వెల్లడించింది. మొబైల్‌ ఫోన్లు, అప్లియెన్సెస్‌, లైఫ్‌ ైస్టెల్‌ ఉత్పత్తులను జోరుగా కొనుగోలు చేశారన్నది. తొలి రోజైన అక్టోబర్‌ 7నాటి సేల్స్‌ డాటాను కంపెనీ వెల్లడిస్తూ గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ దఫా లైఫ్‌ ైస్లెల్‌ ఉత్పత్తులకు ఆర్డర్లు 10 రెట్లు పెరిగాయని, ఫర్నీచర్‌ అమ్మకాలు 8 రెట్లు, ఎలక్ట్రానిక్స్‌ 7 రెట్లు అధికమైనట్టు తెలిపింది.మొదటిరోజున 9.1 కోట్ల మంది కస్టమర్‌ విజిట్స్‌ జరిగాయన్నది. అక్టోబర్‌ 8న ఫ్లిప్‌కార్ట్‌ తన వీఐపీ కస్టమర్లకు 24 గంటలూ యాక్సెస్‌ కల్పించింది. పెయిడ్‌ సబ్‌స్క్రయిబర్లను, ఒక ఏడాదిలో కనీసం నాలుగు దఫాలు ప్లాట్‌ఫామ్‌పై షాప్‌ చేసిన ప్లస్‌ క్యాటగిరీ సబ్‌స్క్రయిబర్లను వీఐపీ కస్టమర్లుగా ఫ్లిప్‌కార్ట్‌ పరిగణిస్తున్నది. తమ షాపర్లలో అత్యధికంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాల నుంచి విజిట్‌ చేశారని, అటుతర్వాత స్థానాల్లో ముంబై, పూణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, గుర్‌గావ్‌లు ఉన్నాయి. మెట్రో, టైర్‌ 2 నగరాల నుంచి రూ.20,000 ధరకు పైబడిన స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరిగిందని ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది.

*  81 ప్రొ’ పేరుతో ఇటీవల మెకానికల్ కీబోర్డును విడుదల

చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ ఇప్పటికే టీవీలు, మానిటర్లు, స్మార్ట్‌‌వాచ్‌, ఆడియో గేర్, క్లాథింగ్ లైనప్‌లో సత్తా చాటుతుండగా తాజాగా కీబోర్డును ఆ జాబితాలో చేర్చింది. ‘81 ప్రొ’ పేరుతో ఇటీవల మెకానికల్ కీబోర్డును విడుదల చేసింది. ఇది చూడ్డానికి ‘కీక్రోన్ క్యూ1 ప్రొ’ను పోలినట్టుగా ఉంది. వన్‌ప్లస్ కీబోర్డ్ 81 ప్రొ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని పీబీటీ కీ క్యాప్స్‌తో తీసుకొచ్చిన వింటర్ బోన్ ఫైర్ ఆప్షన్ కీబోర్డు ధర రూ. 17,999 మాత్రమే. ఇందులోని టాక్టిల్ స్విచ్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. రెండోదైన సమ్మర్ బ్రీజ్ ఆప్షన్ ధర రూ. 19,999 మాత్రమే. ఇందులో మార్బల్ కీక్యాప్స్‌ ఉపయోగించారు. కీక్రోన్‌తో కలిసి వన్‌ప్లస్ ఈ కీబోర్డులను విడుదల చేసింది.  సాధారణ కీక్యాప్స్, స్విచ్ పుల్లర్‌ను కూడా అదనంగా ఇస్తోంది. కీబోర్డును సిస్టంకు కనెక్ట్ చేసుకునేందుకు నాణ్యమైన టైప్-సికి కేబుల్‌ను కూడా ప్రొవైడ్ చేస్తోంది. ఇది 1,000హెర్ట్జ్ పోలింగ్ రేటుకు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విడుదల చేసిన రెండు  కీబోర్డుల డిజైన్‌లలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఈ కీబోర్డు రివ్యూలు కూడా పాజిటివ్‌నే ఉన్నాయి.

నేడు సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. అయితే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 66,473కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 19,811కి ఎగబాకింది. 

అశోక్‌ లేల్యాండ్‌ మరో కొత్త ట్రక్కును మార్కెట్‌లోకి విడుదల

ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ (Ashok Leyland) ‘ఇంటర్మీడియేట్‌ కమర్షియల్‌ వెహికల్‌ (ICV)’ విభాగంలో మరో కొత్త ట్రక్కును విడుదల చేసింది. ‘ఈకామెట్‌ స్టార్‌ 1915 (ecomet Star 1915)’ పేరిట వస్తున్న ఈ ట్రక్కు ‘గ్రాస్‌ వెహికల్‌ వెయిట్‌ (GVW)’ 18.49 టన్నులు. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ పేలోడ్‌ సామర్థ్యాన్ని అందించే ట్రక్కు ఇదేనని కంపెనీ తెలిపింది. మొత్తం నాలుగు లోడింగ్‌ కాన్ఫిగరేషన్లలో ఇది అందుబాటులో ఉంది. సుదూర ప్రయాణాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ట్రక్కు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఈకామెట్‌ సిరీస్‌లో ఇప్పటికే అశోక్‌ లేల్యాండ్‌ 1615, 1815, 1815+ ట్రక్కులను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈకామెట్‌ స్టార్‌ 1915 (ecomet Star 1915)ను ఈ-కామర్స్‌, పార్శిల్‌ డెలివరీ, తాజా ఉత్పత్తుల రవాణా, వాహన విడిభాగాలు, ఎఫ్‌ఎంసీజీ వంటి వస్తువులను సరఫరా చేసేందుకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది. 110 kW (150 hp) H4 ఇంజిన్‌తో దీన్ని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. 350 లీటర్లు, 185 లీటర్ల ట్యాంక్‌ కెపాసిటీతో ఈ ట్రక్కు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఇంధన సామర్థ్యం, వేగవంతమైన ‘టర్న్‌ ఎరౌండ్‌ టైమ్‌’, మన్నికైన టైర్లు, నిర్వహణ ఖర్చుల తగ్గింపు విషయంలో ఈ ట్రక్కు పరిశ్రమలోనే అత్యుత్తమైనదని చెప్పారు.

*  నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్న:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98 విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z