Health

గర్భ నృత్యం…ఆరోగ్యానికి ఎంతో మేలు

గర్భ నృత్యం…ఆరోగ్యానికి ఎంతో మేలు

ఆరోగ్య తాండవం.. ‘దాండియా’*
—————————-
దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్లో పాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్భ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*’గర్భ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్స వాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్భ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్భ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్భ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటు న్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు.

**కేలరీల ఖర్చు
గంటసేపు గర్భ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు
ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగి మల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే
ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్భ చేస్తే.. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్భ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్న విడుదల చేయ డమే ఇందుకు కారణం. అదీగాక ఇది. బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది. అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయం లోనే కాదు సంవత్సరం పొడగునా గర్భా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. **గుండెకు మంచిది.

గర్భలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్చ్వాస నిశ్శ్వాసల వేగం పెరుగుతుంది. కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని
నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z