Business

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ జరిమానా

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ జరిమానా

పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో పేమెంట్ బ్యాంక్‌కు రూ. 5.39 కోట్ల పెనాల్టీని విధించింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం, ‘ఆర్‌బీఐ (నో యువ కస్టమర్) ఆదేశాలు-2016’ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పాటించలేదు.బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949 చట్టంలోని నిబంధనలను అనుసరించి ఈ జరిమానా విధించామని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ చర్య నియంత్రణ లోపాలపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ పాటిస్తున్న కేవైసీ నిబంధనల విషయంపై ఆర్‌బీఐ ఆడిటింగ్ జరిపిందని ప్రకటనలో స్పష్టం చేసింది. తమ పరిశీలనలో ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైనట్లు గుర్తించామని, దీనిపై తాము ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని పేటీఎం పేమెంట్ బ్యాంకుకు ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z