Business

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచాలంటూ సంస్థ యాజమాన్యం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లుగా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ, గవర్నర్‌ ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో వీరి వయోపరిమితి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సర్వీసులో విలీనంపై విధివిధానాలు, ఉద్యోగుల క్యాడర్‌ ఖరారుకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వయో పరిమితి పెంపు ప్రతిపాదనను కమిటీకి అందించాలని రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్టీసీ ఎండీకి ఈ నెల 11న లేఖ రాశారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z