Sports

నేడు హెచ్‌సీఏ ఎన్నికలు

నేడు హెచ్‌సీఏ ఎన్నికలు

నేడు HCA ఎన్నికలు జరుగనున్నాయి. ఉప్పల్ వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మెత్తం 173 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంల లోపు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే HCA ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకూ రాజకీయ రంగు పడ్డట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ జరుగుతోంది. తమ‌ ప్యానల్ కు ప్రభుత్వ మద్దతు ఉందంటోన్నారు జగన్మోహనరావు. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ HCA ప్యానెల్ పేరుతో బరిలో జగన్మోహనరావు ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో పోటీలో అనిల్ కుమార్ ప్యానల్ ఉంది. బీజేపీ, HCA మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు అనిల్ కుమార్. అలాగే క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో ఎన్నికల బరిలోకి శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరపున అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు అమర్నాథ్. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z