Devotional

టీటీడీ నిధుల ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం

టీటీడీ నిధుల ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి తితిదే బడ్జెట్‌లో ఒకశాతం నిధి కేటాయించాలని తితిదే ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు తితిదే ఈవోకు.. దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌ మెమో ఇచ్చారు. ఇటీవల జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుపతి నగర అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్‌లో ఒకశాతం కేటాయించి ఓ ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ధార్మిక సంస్థల నుంచి వ్యతిరేకత రావటంతో ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తితిదే ఈవోను ఆదేశించింది. ప్రభుత్వం వెనుకడుగు భక్తుల విజయమని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z