Sports

న్యూజిలాండ్‌ పై ష‌మీ అద్భుతమైన బౌలింగ్

న్యూజిలాండ్‌ పై ష‌మీ అద్భుతమైన బౌలింగ్

సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ.. అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా షమీ చరిత్రకెక్కాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న షమీ.. తాజాగా కొరుకుడు పడని ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. ధర్మశాలలో 10 ఓవర్లు వేసిన షమీ 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

కూర్పు కారణంగా అత్యుత్తమ పేసర్‌ను బయట పెట్టాల్సి వచ్చినా.. ఏమాత్రం ఇబ్బంది పడని షమీ.. ఈ మెగాటోర్నీలో భారత్‌ ఆడుతున్న ఐదో మ్యాచ్‌లో గానీ బరిలోకి దిగలేకపోయాడు. కాంబినేషన్‌ ప్రకారం హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌ మూడో పేసర్‌ కోటాను భర్తీ చేస్తుండటంతో ఇన్నాళ్లు షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దురదృష్టవశాత్తు పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో.. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. శార్దూల్‌ స్థానంలో షమీ తుది జట్టులోకి రాగా.. గాయపడ్డ హార్దిక్‌ ప్లేస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అడుగుపెట్టాడు.

తొలి బంతికే వికెట్‌!…తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షమీ తొలి బంతికే ప్రమాదకర ఓపెనర్‌ విల్‌ యాంగ్‌ను బలి తీసుకున్నాడు. షమీ వాడిగా వేసిన ఆఫ్‌ కట్టర్‌ను యాంగ్‌ వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరగగా.. ఆ తర్వాత మూడో వికెట్‌కు రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిషల్‌ చక్కటి భాగస్వామ్యం నమోదు చేశారు. రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన షమీ రచిన్‌ రవీంద్రను ఔట్‌ చేసి జట్టులో తిరిగి జోష్‌ నింపగా.. ఇక 48వ ఓవర్లో వరుస బంతుల్లో మిషెల్‌ శాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీని పెవిలియన్‌ బాట పట్టించాడు. సెంచరీ హీరో డారిల్‌ మిషెల్‌ కూడా చివరకు షమీకే వికెట్‌ సమర్పించుకోవడంతో.. ఈ మెగాటోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే షమీ ఐదు వికెట్లు తన పేరిట రాసుకున్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z