Food

అరటిపండు దొరకదు – శాస్త్రవేత్తలు హెచ్చరిక

అరటిపండు దొరకదు – శాస్త్రవేత్తలు హెచ్చరిక

అరటి పండు.. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే పండు.. దీంతో.. ఏ పండు తిననివారు కూడా ఎక్కువగా అరటిపండు కొనుగోలు చేస్తుంటారు.. బంధువుల ఇంటికి వెళ్లినా.. లేదా ఏదైనా ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నా.. మరో సందర్భం అయినా.. ఓ డజన్‌ అరటిపండ్లు పట్టుకెళ్తుంటారు.. ఇక, అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్‌లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా.. మనిషి బరువు పెరిగేలా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అరటిపండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. భవిష్యత్‌లో అరటిపండు కనుమరు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు..

ప్రజలు ఎంతో ఇష్టంగా తినే అరటి పండ్లలో కావెండిష్‌ అరటిపండ్లు రకం ఒకటి కాగా.. ఇది వాణిజ్యం పరంగానూ అధికంగా ఎగుమతి చేస్తుంటారు.. అయితే.. ఆ అరటిపండుకే ఇప్పుడు కష్టం వచ్చింది.. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సోకుతోంది.. ఈ ఇన్ఫెక్షన్‌ చెట్టు మూలల్లో దాడి చేసి నాశనం చేస్తుంది.. ఇది ఒక్కసారి చెట్టుపై దాడి చేసిందంటే.. ముందుగా ఆ మొక్క నీటిని గ్రహించే శక్తి కోల్పేయేలా చేస్తుంది.. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోతోంది.. చివరకు ఆ మొక్క నశిస్తుంది.. దీంతో.. ఈ కావెండీష్‌ రకం అరటిచెట్లు అంతరించిపోవడం.. తద్వారా ఆ అరటిపండ్లు కనుమరు అయ్యే ప్రమాదం పొంచిఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా ఫంగస్ వ్యాప్తి కారణంగా అరటిపండ్లు అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పొటాషియం అధికంగా ఉండే ఈ పండుపై వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల అత్యంత విస్తృతంగా వినియోగించబడే అరటిపండ్లు అంతరించిపోయే దశలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక రకాల అరటిపండ్లు ఉన్నాయి, అయితే మానవులు తినే వాటిలో దాదాపు 47 శాతం కావెండిష్ అరటిపండ్లే ఉన్నాయి.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరూ దరిదాపుల్లో లేరని “బనానా: ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్డ్ ది వరల్డ్” అనే పుస్తకాన్ని రాసిన డాన్ కోపెల్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు..

మరోవైపు.. కొంతమంది శాస్త్రవేత్తలు పండు యొక్క వ్యాధి నిరోధకతను పెంచడానికి జన్యు మార్పులలో నిమగ్నమై ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ సమస్యకు అంతిమ పరిష్కారాన్ని సూచించే ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని.. త దర్వారా రైతులు అరటి ఉత్పత్తి పద్ధతులను ప్రాథమికంగా మార్చడం, ప్రత్యేకంగా ఒకే పండ్ల రకాన్ని పండించడం నుండి బయకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అరటి చెట్లలో వచ్చే ఈ ఫంగస్‌ను 1989లో తైవాన్‌లో గుర్తించారు.. TR4 అని కూడా పిలువబడే ట్రాపికల్ రేస్ 4, దాని ఉనికిని ఆస్ట్రేలియాకు విస్తరించింది, ఆ తర్వాత భారతదేశం మరియు చైనా ప్రధాన ప్రపంచ అరటి ఉత్పత్తిదారులు. ఇది మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికాలోని ప్రాంతాలలోకి కూడా ప్రవేశించింది. అదే సమయంలో, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో అరటిపండు బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ జేమ్స్ డేల్ నివేదించినట్లుగా, ఈ వ్యాధి ఇటీవల దక్షిణ అమెరికాలో కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z