Health

ఈ వ్యాధులతో బాధపడేవారు కాఫీ తాగొద్దు

ఈ వ్యాధులతో బాధపడేవారు కాఫీ తాగొద్దు

చాలామందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలామంది వీటిని గుర్తించడం లేదు. సాధారణంగా 5 రకాల వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా కాఫీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల వ్యాధుల ప్రమాదం మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆ వ్యాధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మానసిక సమస్యలు:మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీ తాగడం హానికరం. దీనివల్ల వారు మరింత అశాంతికి గురవుతారు. ఇది తీవ్ర భయాందోళనలకు దారితీస్తుంది. అధిక వినియోగం మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

గర్భధారణ సమయంలో: గర్భధారణ సమయంలో కాఫీ తీసుకోవడం మానేయాలి. వైద్యుల ప్రకారం కాఫీ ఎక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇది గర్భంలో పిండం అభివృద్ధిలో సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా మిస్ క్యారేజ్ సంభవించే అవకాశాలు ఉన్నాయి.

మైగ్రేన్ సమస్య: మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు కాఫీ తీసుకోకుండా ఉండాలి. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని నరాలలో అడ్డంకిని కలిగిస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.

బోలు ఎముకల వ్యాధి: బోలు ఎముకల వ్యాధి వచ్చినప్పుడు ఎముకలు క్రమంగా బలహీనపడుతాయి. తొందరగా విరిగిపోతాయి. కాల్షియం లోపం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని కాల్షియంను బయటికి పంపిస్తుంది. కాబట్టి కాఫీని తాగడం మానుకోవాలి.

అధిక రక్తపోటు: నేడు అధిక రక్తపోటు వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధిగా మారుతోంది. ఎవరికైనా హై బీపీ సమస్య ఉంటే కాఫీ తాగడం మానేయాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో పాటు నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z