ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాసేపట్లో విజయవాడ పర్యటనకు బయల్దేరనున్నారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు.. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు.. మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు సీఎం జగన్.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, గత రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే. వరుస ఏదో ఒక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు సీఎం వైఎస్ జగన్.
👉 – Please join our whatsapp channel here –