పొన్నియిన్ సెల్వన్’, ‘ఇరైవన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలను సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరన్’ (Siren). కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్, సైరన్ ప్రీఫేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
దీపావళి పండగ కానుకగా సైరన్ నుంచి మేకర్స్ టీజర్ వదిలారు. కీర్తి సురేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగిన ఈ టీజర్‌లో జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు. జయం రవి జైలు నుంచి విడుదలైన అనంతరం తన ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ప్రోమోలో జయం రవి రగ్గడ్ లుక్‌లో అలరించాడు. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది.
ఈ చిత్రంలో జయం రవి, కీర్తి సురేష్‌తో పాటు, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, తులసి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: సెల్వ కుమార్ ఎస్.కె, ఎడిటింగ్: రూబెన్. స్టంట్ కొరియోగ్రఫీ దిలీప్ సుబ్బరాయన్. సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.
👉 – Please join our whatsapp channel here –