Devotional

టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చెయ్యాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత వున్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తాం అని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని అలిపిరి వద్ద 23వ తేది నుంచి ప్రారంభిస్తున్నాం.. హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యు రుపాయాలు చెల్లించిటికెట్లు పొందవలసి ఉంటుందన్నారు.. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయింపునకు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్రవేసింది.. వీటిని తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసూకుంటాం అని తెలిపారు.

ఇక, టీటీడీలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తాం.. తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ది పనులుకు రూ.6.15 కోట్లు కేటాయించినట్టు టీటీడీ చైర్మన్‌ తెలిపారు. టీటీడీ ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు.. కాంట్రక్ట్ ఉద్యోగులుకు రూ.6,850 చెల్లిస్తాం అన్నారు. ప్రసాదాలు ముడిసరుకులు నిల్వ వుంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు.. మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులుకు రూ.15 కోట్లు కేటాయించింది పాలకమండలి.. ఎంఆర్‌ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోగా.. పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 21 కోట్లు కేటాయించారు. ఆయుర్వేద హస్పిటల్ లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నారు. రుయాలో టీబీ రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మించాలని నిర్ణయించారు.

మరోవైపు.. స్విమ్స్ లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేపట్టనున్నారు.. స్విమ్స్ లో నూతన కార్డియో,న్యూరో బ్లాక్ ల ఏర్పాటుకు రూ.74 కోట్లు, స్వీమ్స్ లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం, నడకదారిలో భక్తుల భధ్రత కోసం రూ. 3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమరాలు కోనుగోలు, కరీంనగర్ లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి రూ. 15.54 కోట్లు కేటాయించింది టీటీడీ పాలకమండలి. ప్రాచీనకళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళలు కోసం సాయంకాలం కోర్సులు ప్రారంభిస్తాం అన్నారు.. టీటీడీలో అర్హత వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని.. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్ట్ మరియు కార్పొరేషన్ పరిధిలో వున్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z